Bumper Offer: సినీ నటుడు జోగినాయుడుకు సీఎం జగన్ కీలక పదవి

by Vemula.Srinu Prasad |   (  Updated:2023-02-18 13:18:15  IST  )

సినీనటుడు జోగి నాయుడుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బంపరాఫర్ ప్రకటించారు...

Bumper Offer: సినీ నటుడు జోగినాయుడుకు సీఎం జగన్ కీలక పదవి
X

దిశ, డైనమిక్ బ్యూరో: సినీనటుడు జోగి నాయుడుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బంపరాఫర్ ప్రకటించారు. కీలక పదవి కట్టబెట్టారు. 2019 ఎన్నికల్లో వైఎఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున జోగి నాయుడు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైసీపీకి పని చేసిన సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రతీ ఒక్కరికీ సీఎం వైఎస్ జగన్ ఏదో ఒక పదవి కట్టబెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా జోగి నాయుడుకు కూడా సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రియేటివిటీ అండ్ కల్చర్ కమిషన్ క్రియేటివ్ హెడ్‌గా నియమించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రత్యేక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.రజత్ భార్గవ ఉత్తర్వులు జారీ చేశారు.

Also Read...

MP Raghu Rama Raju: సింహం అంటే పరదాలా వెనుక దాక్కోవడమా..?

Next Story