- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీఎం జగన్ సంచలన నిర్ణయం.. మరో వంద సభలకు ప్లాన్
ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ దూకుడు పెంచారు...

దిశ, వెబ్ డెస్క్: ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ దూకుడు పెంచారు. ఇప్పటికే మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర చేపట్టి జనాల్లో తిరుగుతున్నారు. అనంతరం భారీ బహిరంగ సభల్లో ప్రసంగిస్తున్నారు. ప్రజలను ఆకర్షించేలా హామీ ఇస్తున్నారు. అయితే ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఎన్నికల సమయం వరకూ రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలో మొత్తం వంద సభలు, రోడ్ షోలు నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. ప్రతి రోజూ మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో రోడ్ షోలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అవసరాన్ని బట్టి హెల్లికాప్టర్ ద్వారా సుడిగాలి పర్యటన చేయాలని నిర్ణయించారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల తర్వాత సీఎం జగన్ షెడ్యూల్‌ను ఖరారు చేసే అవకాశం నెలకొంది. వరుస పర్యటనలో పార్టీ శ్రేణుల్లో సీఎం జగన్ సమరోత్సాహాన్ని నింపనున్నారు. వై నాటు 175 అంటూ ఇప్పటికే సీఎం జగన్ బస్సు యాత్ర చేపడుతున్న విషయం తెలిసిందే.






