- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అర్చకులకు Cm Jagan గుడ్ న్యూస్
రాష్ట్రంలోని అర్చకులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంక్రాంతి కానుకగా తీపి కబురు అందించారు. ..

X
దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలోని అర్చకులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంక్రాంతి కానుకగా తీపి కబురు అందించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పటికే వంశపారం పర్యంగా అర్చకుల నియామకానికి, జీతాలను పెంచిన సీఎం జగన్ తాజాగా అర్చకుల సంక్షేమానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ఆర్చుకులకు వందశాతం వైద్య ఖర్చులు తిరిగి చెల్లింపునకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ శనివారం మీడియాకు తెలియజేశారు. తక్షణమే ఈ ఉత్తర్వులు అమలులోకి వచ్చేలా అధికారులను ఆదేశించినట్లు స్పష్టం చేశారు. అర్చకులకు వందశాతం వైద్య ఖర్చులు చెల్లించడం వల్ల చాలా మందికి మేలు జరుగుతుందని మంత్రి కొట్టు సత్యనారాయణ వ్యాఖ్యానించారు.
Next Story






