CM Jagan: తెలుగు లోగిళ్లలో ప్రతి ఇంటా సిరులు వెల్లివిరియాలి.. ఏపీ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్

by Disha Web Desk 1 |
CM Jagan: తెలుగు లోగిళ్లలో ప్రతి ఇంటా సిరులు వెల్లివిరియాలి.. ఏపీ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్
X

దిశ, వెబ్‌డెస్క్ : రాష్ట్ర ప్రజలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ సీఎం జగన్‌ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. మకర సంక్రాంతి పల్లె, రైతు, అక్కచెల్లెమ్మల పండగ అని అన్నారు. మన సంస్కృతీ, సంప్రదాయాలను విరజిమ్మేలా అచ్చ తెలుగు పండగ సంక్రాంతి అని పేర్కొన్నారు. భోగి మంటలు, రంగవల్లులు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల ఆటలు, గాలి పటాల సందళ్లు, పైరు పచ్చల కళకళలు గ్రామాల్లో సంక్రాంతి శోభను తీసుకువచ్చాయని పేర్కొన్నారు. భోగి, సంక్రాంతి, కనుమ పండుగలను ప్రతి గ్రామం, పట్టణాల్లో ఉన్న ప్రతి కుటుంబం సంతోషంగా జరుపుకోవాలని జగన్ అకాక్షించారు. పండుగ సంబరాలతో తెలుగు లోగిళ్లలో ప్రతి ఇంటా సిరులు వెల్లివిరియాలి సీఎం జగన్ అన్నారు.



Next Story