మాతా శిశు సంరక్షణ కేంద్రం ప్రారంభించిన సీఎం

by Thanuru Gopichand |   (  Updated:2026-01-30 07:14:12  IST  )

2018లో పనులకు శంకుస్థాపన చేసిన చంద్రబాబు నాయుడు. ఎట్టకేలకు కూటమి ప్రభుత్వ హయాంలో పూర్తైన పనులు.

మాతా శిశు సంరక్షణ కేంద్రం ప్రారంభించిన సీఎం
X

దిశ, వెబ్ డెస్క్ : గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో (Guntur GGH) మాతా శిశు సంరక్షణ (Mother And Child Care Centre) కేంద్రం ఇటీవల పూర్తయ్యింది. శుక్రవారం నిర్వహించిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandra Babu Naidu) ముఖ్య ఆహ్వానితులుగా హాజరయ్యారు. ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని సీఎం ప్రారంభించారు. రూ.100 కోట్ల నిధులతో సంరక్షణ కేంద్రాన్ని ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేశారు. ఈ కేంద్రానికి సీఎం చంద్రబాబు నాయుడు 2018లో శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు. అవసరమైన పరికరాలను సమకూర్చేందుకు ప్రభుత్వం తరపున రూ.27 కోట్ల నిధులను కేటాయించారు. ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సదస్సులో ఆసుపత్రి వర్గాలు మాతా శిశు సంరక్షణ కేంద్రానికి పునాదులు పడిన నాటి నుంచి నేటి వరకు జరిగిన పనులు, ఎదురైన సమస్యలు, ప్రభుత్వ సహకారం వంటి అంశాలను వివరిస్తూ వీడియోను ప్రదర్శించారు. దీని వల్ల కేవలం జిల్లాకు సంబంధించిన వారికే కాకుండా, ఇతర జిల్లాల వారికి కూడా ఎంతగానో మేలు జరుగుతుందని ఆసుపత్రి వర్గాల వారు తెలిపారు. గతంలో గర్భిణులు, శిశువుల ఇబ్బందులను చూసి చలించిపోయిన సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈ బృహత్తర ప్రణాళికకు రూపునిచ్చి విజయవంతంగా పూర్తి చేసిందని తెలిపారు.

Next Story