- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జమ్మూ కశ్మీర్‌లో ఏపీ జవాన్ మృతి.. సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్బ్రాంతి
జమ్మూకశ్మీర్‌లో సోమవారం ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఏపీ చిత్తూరుకు చెందిన ఆర్మీ జవాన్ పంగల కార్తీక్ మృతి చెందాడు.

దిశ, వెబ్ డెస్క్: జమ్మూకశ్మీర్‌లో సోమవారం ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో చిత్తూరుకు చెందిన ఆర్మీ జవాన్ పంగల కార్తీక్ మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. దేశం కోసం ప్రాణాలర్పించిన కార్తీక్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కార్తీక్ కుటుంబానికి అన్ని వేళలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కాగా, చిత్తూరు జిల్లాలోని బంగారు పాల్యం మండలం రాగి మానుపెంట గ్రామానికి చెందిన పంగల కార్తీక్ 2017లో ఆర్మీలో చేరారు. కార్తీక్ మరణవార్తతో రాగి మానుపెంట గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
కాగా, మృతదేహం 3 రోజుల్లో స్వగ్రామానికి వస్తుందని గ్రామ సర్పంచ్ శ్రీహరి తెలిపారు. ప్రత్యేక ఆపరేషన్ లో ఉన్నా.. ఇక్కడ చాలా రిస్కు ఉందని ఆదివారమే తన కుమారుడు మాట్లాడాడని కార్తీక్ తండ్రి వరదరాజులు చెప్పుకుంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ఫిబ్రవరి 8, 9 తేదీల్లో ఇంటి వస్తానని చెప్పాడని, ఇంతలోనే ఈ ఘోరం జరిగిందంటూ వాపోయారు.






