Flash : తిరుపతిలో సీఎం చంద్రబాబు పర్యటన రద్దు

by Naga Rani Yarlagadda |

సీఎం చంద్రబాబు నాయుడు తిరుపతి పర్యటన రద్దయింది. ఏవియేషన్ అధికారులు క్లియరెన్స్ ఇవ్వకపోవడంతో ఆయన పర్యటన రద్దైనట్లు అధికారులు తెలిపారు.

Flash : తిరుపతిలో సీఎం చంద్రబాబు పర్యటన రద్దు
X

దిశ, వెబ్‌డెస్క్: సీఎం చంద్రబాబు నాయుడు నేడు తిరుపతిలో పర్యటించాల్సి ఉంది. అయితే ప్రతికూల వాతావరణం నేపథ్యంలో ఆయన తిరుపతి పర్యటన రద్దయినట్లు అధికారులు వెల్లడించారు. ఉదయం 9 గంటలకే తిరుపతి చేరుకుని, 11 గంటలకు మహిళా సాధికారత సదస్సులో సీఎం చంద్రబాబు పాల్గొనాల్సి ఉంది. కానీ.. అమరావతి - తిరుపతి మధ్య ఆకాశంలో దట్టమైన మేఘాలు అలుముకుని ఉండటంతో సీఎం ప్రత్యేక హెలికాప్టర్లో తిరుపతికి పయనమయ్యేందుకు ఏవియేషన్ అధికారులు క్లియరెన్స్ ఇవ్వలేదు. దీంతో ఆయన పర్యటన రద్దయినట్లు తెలిపారు. కాగా.. అల్పపీడనం కారణంగా రాష్ర్టంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆకాశంలో దట్టమైన మేఘాలు కమ్ముకున్నాయి.

Next Story