- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘ఆ మాట అనగానే.. పౌరుషం వస్తోంది’.. సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
ఏపీలో తిరంగ యాత్ర ఘనంగా నిర్వహించారు

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో తిరంగ యాత్ర ఘనంగా నిర్వహించారు. విజయవాడలో ఇవాళ(శుక్రవారం) సాయంత్రం 5 గంటలకు తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఎన్డీయే కూటమి నిర్వహించిన ఈ తిరంగా ర్యాలీలో ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గబాటి పురంధేశ్వరి పాల్గొన్నారు. ఈ తిరంగా యాత్రకు భారీ ఎత్తున ప్రజలు తరలివచ్చారు. ఈ నేపథ్యంలో విజయవాడలో నిర్వహించిన తిరంగా ర్యాలీలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. పాక్ కాల్పుల్లో ఏపీకి చెందిన తెలుగు వీర జవాన్ మురళీనాయక్ వీర మరణం పొందారని గుర్తు చేశారు. అతను చేసిన త్యాగానికి దేశం రుణపడి ఉంటుందన్నారు. ఈ క్రమంలో ఇండియన్ ఆర్మీ పై సీఎం చంద్రబాబు(CM Chandrababu) ప్రశంసలు కురిపించారు.
ఉగ్రవాదంపై పోరులో రక్షణ దళాలు పోరాటానికి సెల్యూట్ చేస్తున్నాను అని పేర్కొన్నారు. అంతా గర్వించదగ్గ దళాలు భారతదేశానికి ఉండడం గర్వకారణం అన్నారు. జాతీయ జెండాను చూడగానే దేశభక్తి ఉప్పొంగుతుంది. జాతీయ జెండా(Flag)ను రూపొందించిన పింగళి వెంకయ్య(Pingali Venkaiah) ఈ ప్రాంతం వారే కావడం మన అదృష్టమని సీఎం చంద్రబాబు తెలిపారు. ఇక పహల్గమ్ అనగానే మనలో ఖబర్దార్ అనే హెచ్చరించే పౌరుషం వస్తోందని వ్యాఖ్యానించారు. ఈ తిరంగా ర్యాలీలో జాతీయ జెండాలు చేతబట్టి దేశభక్తి నినాదాలు చేస్తూ సైనికులకు మద్దతు తెలిపారు. పాకిస్తాన్ ఉగ్రవాదుల స్థావరాలపై భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ విజయవంతం కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు తిరంగా యాత్ర ఘనంగా నిర్వహించారు.






