- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
CM Chandrababu:ఉగాది రోజు మరో కార్యక్రమం ఆవిష్కరణ.. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం
ఏపీ(Andhra Pradesh)లో ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) అభివృద్ధే(Development) లక్ష్యంగా అడుగులు వేస్తోంది.

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ(Andhra Pradesh)లో ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) అభివృద్ధే(Development) లక్ష్యంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు(CM Chandrababu) ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే సీఎం చంద్రబాబు పలు అభివృద్ధి కార్యక్రమాలు(Development Programmes) కూడా చేపట్టారు. ఈ నేపథ్యంలో తాజాగా సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
రాష్ట్రంలో పేదరిక నిర్మూలనే(Poverty is eradicated) లక్ష్యంగా ఉగాది రోజున పబ్లిక్(Public), ప్రైవేట్(Praivate), పీపుల్స్(Peoples) పార్ట్‌నర్‌షిప్ (P4) కార్యక్రమాన్ని ఆవిష్కరిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. పారిశ్రామిక వేత్తలు, ఎన్నారై(NRI)లతో పాటు ఉన్నత స్థాయిలోని ఎంతో మంది దీని ద్వారా పేదలకు సాయం చేసేందుకు ముందుకొస్తున్నారని, వారందరినీ ఒకే గొడుగు కిందకు తెచ్చి పీ4 అమలు చేస్తామన్నారు. విధివిధానాలపై ప్రజల నుంచి సలహాలు, సూచనలు తీసుకునేందుకు ప్రత్యేక పోర్టల్(Special Portal) ఏర్పాటు చేయాలని అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు.
ఈ క్రమంలో గత ప్రభుత్వం పై సీఎం చంద్రబాబు మరోసారి నిప్పులు చెరిగారు. వైసీపీ(YCP) హయాంలో ప్రజల జీవన ప్రమాణాలు పడిపోయాయని.. అయినప్పటికీ ప్రభుత్వానికి ఆదాయం(Income) కోసం ప్రజలపై అదనపు భారం మోపలేమని ఆయన వెల్లడించారు. రాష్ట్రం మళ్లీ అభివృద్ధి చెందాలంటే ఆదాయార్జన శాఖలు మంచి ఫలితాలు రాబట్టాలని అన్నారు. సాధారణ పనితీరు, లక్ష్యాలతో పని చేస్తే ఫలితాలు రావని సీఎం పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆదాయం పెంచేందుకు వినూత్న ఆలోచనలతో ముందుకెళ్లాలని అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు.






