Breaking : సీఎం చంద్రబాబు గుంటూరు పర్యటన రద్దు.. కారణం ఇదే!

by Jakkula.Mamatha |   (  Updated:2025-05-03 14:00:54  IST  )

ఏపీ(Andhra Pradesh) సీఎం చంద్రబాబు ఈ నెల(మే) 7వ తేదీన గుంటూరు జిల్లాలో పర్యటించనున్న విషయం తెలిసిందే.

Breaking : సీఎం చంద్రబాబు గుంటూరు పర్యటన రద్దు.. కారణం ఇదే!
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ(Andhra Pradesh) సీఎం చంద్రబాబు ఈ నెల(మే) 7వ తేదీన గుంటూరు జిల్లాలో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో జిల్లాలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. ఈ తరుణంలో గుంటూరులోని శంకర్ విలాస్ ఆర్‌ఓబీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయాల్సి ఉంది. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు గుంటూరు(Guntur) పర్యటన రద్దయినట్లు సమాచారం.

అయితే సీఎం చంద్రబాబు(CM Chandrababu)కు ఆ రోజున వేరే షెడ్యూల్ ఉండటంతో పర్యటన రద్దు అయినట్లు అధికారులు తెలిపారు. శంకుస్థాపన కార్యక్రమంలో సీఎం చంద్రబాబుకు బదులుగా కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొంటారని స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్(Union Minister Pemmasani Chandra Sekhar)స‌హ‌కారంతో ఈ శంకర్ విలాస్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి రూ.98 కోట్లు మంజూరు చేసిన విషయం తెలిసిందే.

Next Story