నేడు తిరుమలకు సీఎం చంద్రబాబు ఫ్యామిలీ..షెడ్యూల్ ఇదే

by velandi.Saikiran |

ఇవాళ సీఎం చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, కుటుంబ సభ్యులు తిరుమల వెళ్ళనున్నారు.

నేడు తిరుమలకు సీఎం చంద్రబాబు ఫ్యామిలీ..షెడ్యూల్ ఇదే
X

దిశ‌, వెబ్ డెస్క్‌: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ తిరుమల టూర్ ఖరారైంది. ఇవాళ సీఎం చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, కుటుంబ సభ్యులు తిరుమల వెళ్ళనున్నారు. రేపు దేవాన్ష్ బర్త్ డే ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకోనున్నారు. ఇందులో భాగంగానే కుటుంబ సభ్యులతో హైదరాబాద్ నుంచి రేణిగుంట చేరుకొని, అక్కడి నుంచి తిరుమల వెళ్తారు మంత్రి నారా లోకేష్. అదే సమయంలో ఉండవల్లి నుంచి హెలికాప్టర్లో తిరుపతి చేరుకొని, అక్కడి నుంచి తిరుమలకు వెళ్లి, ఇవాళ రాత్రి అక్కడే బస చేయనున్నారు సీఎం చంద్రబాబు నాయుడు.

ఇక రేపు సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కాగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మనవడు దేవాన్ష్ పుట్టిన రోజు సందర్భంగా ప్రతి సంవత్సరం తిరుమల శ్రీవారిని దర్శించుకుని, ఆ తర్వాత విరాళం ఇవ్వడం ఆనవాయితీగా వస్తోన్న సంగతి తెలిసిందే. ఈసారి కూడా తిరుమల దేవస్థానానికి సంబంధించిన ఎస్వీ అన్నప్రసాద ట్రస్ట్ కు రూ. 44 లక్షల విరాళంగా ఇవ్వబోతున్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు స్వయంగా అన్న ప్రసాదాలను వడ్డించనున్నారు.

Next Story