Ap: ఆర్య వైశ్యులందరికి శుభాకాంక్షలు: చంద్రబాబు

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-05-07 07:02:47  IST  )

ఆర్య వైశ్యులందరికి సీఎం చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు...

Ap: ఆర్య వైశ్యులందరికి శుభాకాంక్షలు: చంద్రబాబు
X

దిశ, వెబ్ డెస్క్: వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి జయంతి(Vasavi Kanyakaparameshwari Ammavari Jayanti) సందర్భంగా ఆర్య వైశ్యులందరికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు(Ap Cm Chandrababu Naidu) శుభాకాంక్షలు తెలిపారు. పార్వతీదేవి(Parvati Devi) అవతారంగా భావించే వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారు మనందరికి పరమ పూజ్యురాలు అని ఆయన పేర్కొన్నారు. పరమ శివుడికే జీవితాన్ని అంకితం చేసిన వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారు ఆనాటి దుష్టపాలకుడి దుర్నీతికి ఆత్మత్యాగం చేసిన పవిత్రురాలు అని తెలిపారు. అలాంటి ఆ అమ్మవారి జయంతి మనకు ఎంతో పవిత్రమైందని చెప్పారు. అమ్మవారి సేవలో తరిస్తున్న భక్తులందరికి మరొక్కమారు తాను శుభాకాంక్షలు తెలియచేస్తున్నానని చంద్రబాబు ట్వీట్ చేశారు. అంతేకాదు వీడియోను సైతం పోస్ట్ చేశారు.

Next Story