- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలుగు జాతికి గర్వకారణం.. రామ్మోహన్ నాయుడికి CM చంద్రబాబు విషెస్
కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడి(Rammohan Naidu)కి CM చంద్రబాబు(Chandrababu) శుభాకాంక్షలు చెప్పారు.

దిశ, వెబ్‌డెస్క్: కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడి(Rammohan Naidu)కి CM చంద్రబాబు(Chandrababu) శుభాకాంక్షలు చెప్పారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం(World Economic Forum) గ్లోబల్ యంగ్ లీడర్ జాబితాలో రామ్మోహన్ నాయుడుకి చోటు దక్కడం తెలుగు ప్రజలకు గర్వకారణం అన్నారు. రామ్మోహన్ నిబద్ధత యువతకు మార్గదర్శకమని తెలిపారు. ఆయన్ను ప్రతీ ఒక్క యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఇదిలా ఉండగా.. ప్రపంచవ్యాప్తంగా తమ రంగాల్లో ఉత్తమ నాయకత్వం కనబరిచిన యువ నాయకులను వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఎంపిక చేస్తుంది. ఈసారి భారత్ నుంచి ఏడుగురు ఎంపిక కాగా, అందులో తెలుగు రాష్ట్రాల నుంచి రామ్మోహన్ నాయుడికి స్థానం లభించింది. దీనిపై రామ్మోహన్ నాయుడు స్పందిస్తూ వరల్డ్ ఎకనామిక్ ఫోరం ద్వారా ‘ యంగ్ గ్లోబల్ లీడర్’గా ఎంపిక కావడాన్ని గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు. ముఖ్యమైన, ప్రభావితమైన నిర్ణయాలు తీసుకునే స్థానంలో భారత యువత ప్రాధాన్యం పెరుగుతోందన్నారు. నిజాయితీ, నూతన ఆలోచనలతో ప్రజలకు సేవ చేయాలని ఈ గుర్తింపు మరింత గుర్తు చేస్తుందని ఆయన అన్నారు.






