- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేడే రైతుల ఖాతాల్లోకి రూ.6000...ఇలా చెక్ చేసుకోండి
ఉగాది కానుకగా పీఎం కిసాన్ తో పాటు అన్నదాత సుఖీభవ నిధులను గన్నవరంలో సీఎం చంద్రబాబు నేడు రిలీజ్ చేయనున్నారు.

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైతులకు ఉగాది కానుక అందించేందుకు ముందుకు వచ్చింది కూటమి సర్కార్. ఇవాళ ఏపీ రైతుల ఖాతాలలో రూ. 6000 జమ చేయనుంది. పీఎం కిసాన్ స్కీంలో భాగంగా నేడు అస్సాం పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ, 22వ విడత నిధులు విడుదల చేస్తారు. ఈ సందర్భంగా 9.32 కోట్ల మంది రైతుల ఖాతాలలో రూ. 2000 చొప్పున జమ చేయనున్నారు. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ నిధులు సీఎం చంద్రబాబు రిలీజ్ చేస్తారు.
ఏపీలో అన్నదాత సుఖీభవ నిధుల విడుదల
ఉగాది కానుకగా పీఎం కిసాన్ తో పాటు అన్నదాత సుఖీభవ నిధులను కృష్ణా జిల్లా గన్నవరంలో సీఎం చంద్రబాబు నాయుడు నేడు రిలీజ్ చేయనున్నారు. 48.85 లక్షల మంది రైతుల అకౌంట్లో రూ. 6000 చొప్పున జమ చేయనున్నారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం నుంచి రూ. 2000 అందనుండగా, రూ. 4000 ఏపీ సర్కార్ అందిస్తుంది. ఇక ఈ అన్నదాత సుఖీభవ పథకం అర్హుల లిస్టులో మీ పేరు ఉందో లేదో తెలుసుకోవడానికి ఈ https://annadathasukhibhava.ap.gov.in/ లింక్ లో చూసుకుంటే సరిపోతుంది.






