CM Chandrababu: ఆయన స్ఫూర్తితోనే పరిపాలన కొనసాగిస్తున్నాం.. సీఎం చంద్రబాబు

by Kema Shiva Kumar |

బాబు జగ్జీవన్‌రామ్ స్ఫూర్తితోనే తాము రాష్ట్రంలో పరిపాలన కొనసాగిస్తున్నామని సీఎం చంద్రబాబు (CM Chandrababu) అన్నారు.

CM Chandrababu: ఆయన స్ఫూర్తితోనే పరిపాలన కొనసాగిస్తున్నాం.. సీఎం చంద్రబాబు
X

దిశ, వెబ్‌డెస్క్: బాబు జగ్జీవన్‌రామ్ స్ఫూర్తితోనే తాము రాష్ట్రంలో పరిపాలన కొనసాగిస్తున్నామని సీఎం చంద్రబాబు (CM Chandrababu) అన్నారు. ఇవాళ ఆయన ఎన్టీఆర్ జిల్లా (NTR District) ముప్పాళ్ల (Muppalla)లో ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం నిర్వహించని సభలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. 30 ఏళ్ల క్రితమే డ్వాక్రా సంఘాలను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌‌ (United Andhra Pradesh)లో ఏర్పాటు చేశామని అన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలు చేశామని తెలిపారు. సెకండ్ జనరేషన్ సంస్కరణలకు శ్రీకారం చుట్టామని అన్నారు. ఒకప్పుడు జన్మభూమి (Janmabhumi) కార్యక్రమం చేపడితే అందరూ సహకరించారని.. ఇప్పుడు P4 అనే వినూత్న కార్యక్రమంతో ముందుకు వెళ్తున్నామని పేర్కొన్నారు. త్వరలోనే తల్లికి వందనం (Thalliki Vandanam) పథకం కింద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి డబ్బులిస్తామని స్పష్టం చేశారు. అమరావతి, పోలవరం నిర్మాణాలు పూర్తి చేయాలని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హమీ మేరకు సూపర్-6 (Super Six)‌ను అమలు చేస్తామని అన్నారు. దేశంలో ఎక్కువ మొత్తంలో పెన్షన్ (Pension) ఇస్తున్న రాష్ట్రం ఒక్క ఆంధ్రప్రదేశేనని తెలిపారు. రాష్ట్రంలో పేదరిక నిర్మూలన జరగాలని.. తలసరి ఆదాయం పెరగాలంటూ సీఎం చంద్రబాబు కామెంట్ చేశారు.

Next Story