CM Chandrababu: రెండంకెల వృద్ధి రేటు సాధిస్తే అద్భుతాలు సృష్టించగలం.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

by Kema Shiva Kumar |

రెండంకెల వృద్ధి రేటు సాధిస్తేనే అద్భుతాలు సృష్టించగలమని సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) అన్నారు.

CM Chandrababu: రెండంకెల వృద్ధి రేటు సాధిస్తే అద్భుతాలు సృష్టించగలం.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: రెండంకెల వృద్ధి రేటు సాధిస్తేనే అద్భుతాలు సృష్టించగలమని సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) అన్నారు. దావోస్‌ (Davos) పర్యటన రెండు రోజు వరల్డ్ ఎకనామిక్ ఫోరం (World Economic Forum) సదస్సులో భాగంగా సీఐఐ (CII) ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రీన్ ఇండస్ట్రియలైజేషన్ (Green Industrialization) మీటింగ్‌లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. వ్యాపారాల్లో భారతీయులు బాగా రాణిస్తారని కితాబిచ్చారు. అందరినీ చూస్తుంటే తనలోనే నమ్మకం పెరిగిందని, భవిషత్తులో తన కలలు కూడా నిజం అవుతాయనే నమ్మం కలిగిందని అన్నారు.

గత 25 ఏళ్లలో హైదరాబాద్ (Hyderabad) ఎంతో అభివృద్ధి సాధించిందని తెలిపారు. ముఖ్యంగా ఐటీ (IT) అభివృద్ధితో నగరం రూపురేఖలు మారిపోయాయని పేర్కొన్నారు. ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రణాళికలు రూపొందించాలని అన్నారు. రెండంకెల వృద్ధి రేటు సాధిస్తే అద్భుతాలు సృష్టించగలమని తెలిపారు. P4 మోడల్ (P4 Model) ద్వారా సమాజంలో మార్పులు వస్తున్నాయని సీఎం చంద్రబాబు (CM Chandrababu) అన్నారు. 2014లో తాను ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) సీఎం బాధ్యతలు చేపట్టాక సోలార్ విద్యుత్‌ (Solar Electricity)పై ఫోకస్ పెట్టామని తెలిపారు.

అదేవిధంగ ఇటీవల పీఎం సూర్య ఘర్ (PM Surya Ghar) కింద ప్రతి ఇంటికీ సోలార్ ఉత్పత్తి చేయాలని కేంద్ర ప్రకటించిందని తెలిపారు. అదేవిధంగా సంప్రదాయేతర ఇంధన వనరుల్లో సౌర, పవన, గ్రీన్ హైడ్రోజన్ (Green Hydrogen) ఉత్పత్తిపై ఎక్కువ దృష్టి పెట్టామని అన్నారు. పంప్డ్ స్టోరేజీ‌ (Pumped Storage)తో హైడల్ విద్యుత్ ఉత్పత్తిపై రాష్ట్రంలో ఫోకస్ పెట్టామని అన్నారు. 115 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు ఇంధన వనరుల్లో వస్తున్నాయని, 500 మెగావాట్లు, 5 ఎంపీటీఏ (MPTA) గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయబోతున్నామని తెలిపారు. అదేవిధంగా 21 బిలియన్ డాలర్ల పెట్టుబడితో ఎన్టీపీసీ (NTPC)-ఏపీ జెన్‌కో (AP GENCO) సంయుక్తంగా గ్రీన్ హైడ్రోజన్ (Green Hydrogen)ను ఉత్పత్తి చేయబోతున్నాయని సీఎం చంద్రబాబు ప్రకటించారు.

Next Story