- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
క్షణం ఆలోచించకుండా తోక కత్తిరిస్తా.. చంద్రబాబు హెచ్చరిక
అనుచిత వ్యాఖ్యలు చేస్తూ.. అసభ్యంగా ప్రవర్తించే రాజకీయ నాయకులను ఉపేక్షించబోమని సీఎం చంద్రబాబు(CM Chandrababu) హెచ్చరించారు.

దిశ, వెబ్‌డెస్క్: అనుచిత వ్యాఖ్యలు చేస్తూ.. అసభ్యంగా ప్రవర్తించే రాజకీయ నాయకులను ఉపేక్షించబోమని సీఎం చంద్రబాబు(CM Chandrababu) హెచ్చరించారు. ఎవరైనా తోక జాడిస్తే.. క్షణం కూడా ఆలోచించకుండా తోక కత్తిరిస్తానని మండిపడ్డారు. శుక్రవారం చంద్రబాబు కడప(Kadapa) జిల్లాలో పర్యటించారు. గూడెం చెరువులో చేనేత కార్మికురాలి ఇంటికి వెళ్లి పింఛను అందించారు. అనంతరం ప్రజావేదిక సభలో ప్రసంగించారు. వితండవాదం చేయడంలో వైసీపీ ఎప్పుడూ ముందు ఉంటుందని విమర్శించారు. ప్రశాంతి రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని జగన్(Jagan) పరామర్శించడం ఏంటి?.. ఇది ఎంతవరకు కరెక్టో ప్రజలే ఆలోచించుకోవాలని చంద్రబాబు సూచించారు. అసలు ఇలాంటి నాయకులు మనకు అవసరమా? అని అన్నారు. జగన్ వైఖరి బాగోలేదు.. అనుచిత వ్యాఖ్యలు చేసేవారిని ప్రొత్సహించే విధంగా ఉందని సీరియస్ అయ్యారు. ఇలాంటి వైఖరి ఉండటం వల్లే.. 11 సీట్లకు పడిపోయారని తీవ్ర విమర్శలు చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కడపలోనే ఏడు సీట్లలో కూటమి అభ్యర్థులను గెలిపించారు.. వచ్చేసారి పదికి పది సీట్లు గెలిపిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఎన్టీఆర్ ఆలోచన నుంచే రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులు పుట్టుకొచ్చాయని అన్నారు.
‘వివేకా హత్య జరిగితే మాపై విషం చిమ్మారు. హత్య కేసు విషయంలో నాపై అభాండాలు వేశారు. మహిళా ఎమ్మెల్యేలపైనా దూషణలకు దిగుతున్నారు. పార్టీలో ఎవరైనా తప్పు చేస్తే కట్టడి చేయాలి. నాయకుడే రెచ్చగొడితే.. కింది స్థాయి నేతలు ఇష్టారాజ్యంగా మాట్లాడతారు. ఇకనైనా బుద్ధి తెచ్చుకొని మారాలి’ అని సీఎం చంద్రబాబు హితవు పలికారు.
Read More: ఆటోలో ప్రయాణించి డ్రైవర్ల సమస్యలు తెలుసుకున్న చంద్రబాబు






