సీఎం వైజాగ్ పోస్ట్ వైరల్

by velandi.Saikiran |

సీఎం చంద్రబాబు నాయుడు సోషల్ మీడియాలో చేసిన వైజాగ్ పోస్టు వైరల్ గా మారింది. గూగుల్ పెట్టుబడులపై ఆకట్టుకునేలా,

సీఎం వైజాగ్ పోస్ట్ వైరల్
X

దిశ, ఏపీ బ్యూరో : సీఎం చంద్రబాబు నాయుడు సోషల్ మీడియాలో చేసిన వైజాగ్ పోస్టు వైరల్ గా మారింది. గూగుల్ పెట్టుబడులపై ఆకట్టుకునేలా, ఆసక్తికరంగా ఉండే విధంగా వైజాగ్ పేరులో గూగుల్ లోగో ప్రతిబింబించేలా డిజైన్ చేసిన పోస్టర్‌ను బుధవారం సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. వైజాగ్ లోని జి ప్లేస్‌లో గూగుల్ లోగోను చేర్చి సముద్రతీరాన్ని బ్యాక్ గ్రౌండ్‌లో ఉంచి ఆయన పోస్టర్ విడుదల చేశారు. 15 బిలియన్ డాలర్ల గూగుల్ ఏఐ డేటా సెంటర్ పెట్టుబడితో దేశం చూపు వైజాగ్ వైపుకు మళ్ళింది. దీనిని ప్రతిబింబించేలా వైజాగ్‌కు గూగుల్ అంటూ వైజాగ్ పేరును, గూగుల్ లోగోను సీఎం సీబీఎన్ పోస్ట్ చేశారు.

Next Story