ఎంతో సంతృప్తిని, సంతోషాన్ని కలిగించింది: సీఎం చంద్రబాబు

by Vemula.Srinu Prasad |

మూలా నక్షత్రాన్ని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై కనకదుర్గ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించడం అదృష్టంగా భావిస్తున్నానని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు...

ఎంతో సంతృప్తిని, సంతోషాన్ని కలిగించింది: సీఎం చంద్రబాబు
X

దిశ, వెబ్ డెస్క్: మూలా నక్షత్రాన్ని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రి(Indrakeeladri)పై కనకదుర్గ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించడం అదృష్టంగా భావిస్తున్నానని సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu) అన్నారు. దుర్గమ్మ(Durgamma)ను దర్శించుకున్న ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఆనందంగా, ఆరోగ్యంగా ఉండేలా చూడాలని దుర్గమ్మను కోరారని చెప్పారు. దసరా(Dasserra) నవరాత్రుల్లో భక్తుల రద్దీకి అనుగుణంగా అధికారులు చేపట్టిన చర్యలు మంచి ఫలితాలను ఇస్తున్నాయని పేర్కొన్నారు. గుడి ప్రాంగణానికి వెళ్లగానే సామాన్య భక్తుల నుంచి వచ్చిన ఆధ్యాత్మిక స్పందన తనకు ఎంతో సంతృప్తిని, సంతోషాన్ని కలిగించిందని తెలిపారు. వారిలో ఉత్సాహం, సంతోషం శాశ్వతం అవ్వాలని అమ్మను కోరుకున్నానని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు మేలు చేసేలా చేపట్టిన కార్యక్రమాలను విజయవంతం చేయాలని అమ్మలగన్న అమ్మను ప్రార్థించనని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

Next Story