క్షేత్రస్థాయిలో పొలిటికల్ గవర్నెన్స్ ఉండాలి : సీఎం చంద్రబాబు నాయుడు

by Naga Rani Yarlagadda |

రాష్ట్రంలో పొలిటికల్ గవర్నెన్స్ పైస్థాయిలో మాత్రమే కాకుండా.. క్షేత్రస్థాయిలో కూడా ఉండాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు.

క్షేత్రస్థాయిలో పొలిటికల్ గవర్నెన్స్ ఉండాలి : సీఎం చంద్రబాబు నాయుడు
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో పొలిటికల్ గవర్నెన్స్ పైస్థాయిలో మాత్రమే కాకుండా.. క్షేత్రస్థాయిలో కూడా ఉండాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్న ఆయన.. ఆదివారం పార్టీ శ్రేణులతో సమావేశమయ్యారు. అలాగే స్థానిక రైతులు, పీ4 లబ్ధిదారులు, పార్టీ నేతలు, అధికారులతోనూ వరుస భేటీలు నిర్వహించారు. ప్రజాసమస్యల పరిష్కారంపై పోలీసులు, అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. అలాగే క్షేత్రస్థాయి విషయాలు, సమస్యలను త్వరగా పరిష్కరించేలా చూడాలని కోరారు. ప్రభుత్వం అమలు చేసే పథకాలతో ప్రజలకు ఇబ్బంది ఉంటే.. వాటిని సరిచేసే బాధ్యతను పార్టీ కార్యకర్తలే తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. ప్రస్తుతం జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)ను సక్రమంగా నిర్వహించేలా చూడాలని సూచించారు. ఈ సందర్భంగా వైసీపీపై సీఎం ఆలోచనలు చేశారు. గొడ్డలిపార్టీ కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండాలని, కుప్పంలో ప్రశాంతతను చెడగొట్టేందుకు వైసీపీ నేతలు ప్రయత్నించిన ఘటనలను గుర్తు చేశారు. ఆ పార్టీవారు చేసే గొడవలపై వైల్డ్ గా రియాక్ట్ కావొద్దని టీడీపీ నేతలకు సూచించారు.

Next Story