ఆటోలో ప్రయాణించి డ్రైవర్ల సమస్యలు తెలుసుకున్న చంద్రబాబు

by Ajay Maddhiboyina |   (  Updated:2025-08-01 10:12:56  IST  )

ఏపీ సీఎం చంద్ర‌బాబు జమ్మ‌ల‌మ‌డుగులో ప‌ర్య‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ ప‌ర్య‌ట‌న‌లో చంద్ర‌బాబు ఆటోలో ప్ర‌యాణించారు.

ఆటోలో ప్రయాణించి డ్రైవర్ల సమస్యలు తెలుసుకున్న చంద్రబాబు
X

దిశ‌, వెబ్ డెస్క్: ఏపీ సీఎం చంద్ర‌బాబు జమ్మ‌ల‌మ‌డుగులో ప‌ర్య‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ ప‌ర్య‌ట‌న‌లో చంద్ర‌బాబు ఆటోలో ప్ర‌యాణించారు. జ‌మ్మ‌ల‌మ‌డుగు చేరుకున్న త‌ర‌వాత అక్క‌డ ఉన్న ఆటో ఎక్కి ప్ర‌జావేదిక కార్య‌క్ర‌మానికి చేరుకున్నారు. ప్ర‌యాణించినంత‌సేపు ఆటోవాలాతో ముచ్చ‌టించారు. వారికి ఉన్న స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకున్నారు. అనంత‌రం ఆటో డ్రైవ‌ర్‌ను తీసుకువెళ్లి అధికారికి చెప్పి వారి సమస్యలు పరిష్కరించాలని సూచించారు. చంద్రబాబు ఆటో ఎక్కడంతో దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Read More: చేనేతలకు గుడ్ న్యూస్.. ఉచిత విద్యుత్‌ అమలుకు గ్రీన్ సిగ్నల్

Next Story