- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
CM Chandrababu: ఆ పాలసీ గేమ్ ఛేంజర్‌గా మారబోతోంది.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
భారతదేశ అభివృద్ధిని ప్రపంచ దేశాలు తీక్షణంగా గమనిస్తున్నాయని సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) అన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: భారతదేశ అభివృద్ధిని ప్రపంచ దేశాలు తీక్షణంగా గమనిస్తున్నాయని సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) అన్నారు. ఇవాళ ఆయన ఢిల్లీ (Delhi)లో మీడియాతో మాట్లాడుతూ.. గతంలో ఐటీ (IT)పై.. నేడు ఏఐ (AI)పై ప్రపంచ దేశాలు దృష్టి పెట్టాయనే విషయాన్ని ఇటీవల తాను దావోస్ (Davos) పర్యటనలో గమనించానని అన్నారు. కానీ ఏఐ (AI) సాంకేతికతలో భారత్ ఇప్పటికే ముందు ఉందని కితాబిచ్చారు. ప్రపంచ దేశాల్లో ఇండియా పేరు మార్మోగుతోందని అన్నారు. 2047 కల్లా భారత్ అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలుస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నానని తెలిపారు. ఏఐ సాంకేతికతలో మన దేశం ప్రముఖ పాత్ర వహించనుందని అన్నారు. తాజాగా బడ్జెట్‌లో కేటాయింపులు చూస్తే ఆ విషయం స్పష్టంగా అర్థం అవుతోందని కోనియాడారు. వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా 2025-26 వార్షిక బడ్జెట్ (Budget)లో కేటాయింపులు చేశారని గుర్తు చేశారు.
అదేవిధంగా మౌలిక వసతులు కల్పనకు అత్యంత ప్రాధాన్యత ఉంటుందని అన్నారు. పన్ను సంస్కరణలో చాలా మార్పలు జరిగాయని.. ఇంకొన్ని మార్పులు కూడా జరగబోతున్నాయని తెలిపారు. విద్యుత్ రంగంలో సంస్కరణలు ఏపీలోనే ప్రథమంగా జరిగాయని గుర్తు చేశారు. ఎంఎస్ఎంఈ పాలసీ (MSME Policy) గేమ్ ఛేంజర్‌గా మారబోతోందని కామెంట్ చేశారు. ఇప్పుడు పబ్లిక్, ప్రైవేటు, పీపుల్ పార్ట్‌నర్‌షిప్ విధానంతో భారత్‌లో పెట్టుబడులకు చాలా మంది ముందుకు వస్తున్నారని అన్నారు. పలు రంగాల్లో భారీగా పెట్టుబడులు రాబోతున్నాయని జోస్యం చెప్పారు. దీంతో నూతన ఆవిష్కరణలతో పాటు మౌలిక సాదుపాయాల కల్పన పెరుగుతోందని అన్నారు. వృద్ధి రేటను పెంచేలా నిర్మలా సీతారామన్ బడ్జెట్ ఉందని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా వాణిజ్యవేత్తల్లో భారతీయులే ప్రముఖంగా ఉండటం సంతోషకరమైన విషయమని సీఎం చంద్రబాబు అన్నారు.






