సింగపూర్‌లో రెండు గంటల పాటు కాలినడకన తిరిగిన ఏపీ సీఎం

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-07-28 08:39:20  IST  )

ఏపీ రాజధాని అమరావతిని అభివృద్ధి చేసేందుకు సింగపూర్ ప్రాజెక్టులను సీఎం చంద్రబాబు బృందం పరిశీలిస్తోంది..

సింగపూర్‌లో రెండు గంటల పాటు కాలినడకన తిరిగిన ఏపీ సీఎం
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ రాజధాని అమరావతి(Amaravati)ని అభివృద్ధి చేసేందుకు సింగపూర్ ప్రాజెక్టు(Singapore Project)లను సీఎం చంద్రబాబు(Cm Chandrababu) బృందం పరిశీలిస్తోంది. ఈ మేరకు ఆయన పర్యటన కొనసాగుతోంది. తొలి రోజు కొన్ని ప్రాజెక్టులను పరిశీలించిన సీఎం టీమ్.. సింగపూర్‌లో 10 వేల కటుంబాలు నివాసం ఉండే బిడదారి ఎస్టేట్లో ఈ రోజు రెండు గంటల పాటు కాలి నడకన పర్యటించింది. సిటీ ఇన్ ఎ గార్డెన్ పేరుతో ఏర్పాటైన హౌసింగ్ ప్రాజెక్ట్ విశిష్టతలను ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఈ సందర్బంగా సింగపూర్ అధికారులు వివరించారు.


కాగా బిడదారీ హౌసింగ్ ప్రాజెక్టును సింగపూర్ హౌసింగ్ డెవలప్మెంట్ బోర్డు తీర్చిదిద్దింది. పట్టణ, నగర ప్రాంతాల్లో అందుబాటు ధరలో నాణ్యమైన నివాస గృహాల నిర్మించింది. 250 ఎకరాల్లో విస్తరించిన సింగపూర్ ప్రభుత్వ హౌసింగ్ ప్రాజెక్టును ఏర్పాటు చేసింది. సీఎం బృందం సందర్శించారు. 10 వేల కుటుంబాలు నివాసం ఉండేలా అన్ని వసతులతో పర్యావరణ హితంగా నివాస సముదాయాన్ని నిర్మించారు. అలాగే శ్మశాన ప్రాంతాన్ని సుందరమైన పార్క్‌గా మార్చి సింగపూర్ అర్బన్ రీడెవల్పమెంట్ అథారిటి మార్చింది. ఈ ప్రాజెక్టును సీఎం చంద్రబాబు టీమ్ సందర్శించింది. అర్బన్ హౌస్ ప్లానింగ్‌లో భాగంగా బిడదారి ఎస్టేట్‌లో సీఎం బృందం పర్యటించింది. చెట్లు తొలగించకుండా, సహజ నీటి వనరులు దెబ్బతినకుండా నిర్మాణాలు చేపట్టిన విధానాన్ని సీఎం చంద్రబాబు నాయుడకు సింగపూర్ అధికారులు వివరించారు. అనంతరం సింగపూర్ హౌసింగ్ డెవలప్మెంట్ బోర్డు, సింగపూర్ అర్బన్ రీడెవలప్మెంట్ అథారిటీ, సింగపూర్ కార్పొరేషన్ ఎంటర్ ప్రైజ్ సహా ప్రపంచ బ్యాంకు అధికారులతో సీఎం బృందం సమావేశమైంది. రాజధాని అమరావతి నిర్మాణంలో అనుసరిస్తున్న విధానాలు, ఆలోచనలు, ప్రణాళికలను వారితో సీఎం బృందం పంచుకుంది. ఏపీలో చేపట్టనున్న అర్బన్ హౌసింగ్ ప్రాజెక్టుల్లో సింగపూర్ సహకారంపై సమావేశంలో చర్చించారు. బిడదారి ప్రాజెక్ట్‌ను రూపొందించిన విధానం చాలా గొప్పగా ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. పర్యావరణం దెబ్బతినకుండా చేపట్టిన అర్బన్ ప్రాజెక్టు అద్భుతంగా ఉన్నాయని కితాబిచ్చారు.

అమరావతి అనేది కొత్త ఆలోచనలతో, అధునిక వసతులతో నిర్మాణం అవుతున్న కొత్తనగరం అని, మంచి అవకాశం, ఉత్తమ విధానాలు, అనుభవాలను ఉపయోగించి నిర్మిస్తున్నామని సింగపూర్ అధికారులకు సీఎం చంద్రబాబు నాయుడు వివరించారు. సింగపూర్ ఇప్పటికే మాస్టర్ ప్లాన్ ఇచ్చిందనీ.. నిర్మాణంలో వరల్డ్ బ్యాంక్ కూడా భాగస్వామి అవుతోందని తెలిపారు. గతంలో జరిగిన కొన్ని ఘటనల కారణంగా సింగపూర్ - ఏపీ ప్రభుత్వాల మధ్య కొన్ని సమస్యలు వచ్చాయని పేర్కొన్నారు. కొన్ని నిర్ణయాల కారణంగా రాస్ట్రం నమ్మకాన్ని కోల్పొయిందనీ.. గతంలో జరిగిన తప్పులను సరిదిద్దడానికి సింగపూర్ వచ్చానని, ఏపీతో పాటు అమరావతిలో చేపట్టే హౌసింగ్ ప్రాజెక్టుల్లో భాగస్వాములు కావాలని సింగపూర్ హౌసింగ్ డెవల్మెంట్ బోర్డును సిఎం చంద్రబాబు కోరారు.

Next Story