- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
CM Chandrababu: విద్యార్థులు స్మార్ట్‌ఫోన్లకు బానిసలు కావొద్దు.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
పాఠశాలలు, కాలేజీలకు వెళ్తున్న విద్యార్థులు స్మార్ట్ ఫోన్ల (Smart Phones)కు బానిసలు కావొద్దని సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandababu Naidu) అన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: పాఠశాలలు, కాలేజీలకు వెళ్తున్న విద్యార్థులు స్మార్ట్ ఫోన్ల (Smart Phones)కు బానిసలు కావొద్దని సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandababu Naidu) అన్నారు. బాపట్ల మునిసిపాలిటీ (Bapatla Municipality) పరిధిలో మెగా పేరెంట్స్, టీచర్స్ మీట్ కార్యక్రమానికి మంత్రి నారా లోకేశ్ (Minister Nara Lokesh)తో పాటు సీఎం చంద్రబాబు (CM Chandrababu) కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పిల్లల చదువుల పట్ల తల్లిదండ్రులు ఎప్పకప్పుడు పర్యవేక్షించాలని అన్నారు. విద్యా్ర్థులు స్మా్ర్ట్ ఫోన్లకు బానిసలు కాకుండా చూసే బాధ్యత పేరెంట్స్‌పై ఉందన్నారు. యుక్త వయసులో పిల్లలు డ్రగ్స్ (Drugs), ఇతర దురవాట్లకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. మదకద్రవ్యాలు మానవ సంబంధాలను నాశనం చేస్తాయని తెలిపారు. రాష్ట్రంలో డ్రగ్స్ రక్కసిని రూపుమాపేందుకు ప్రభుత్వం ఈగల్ (Eagle) పేరుతో డ్రగ్స్ నిరోధక వ్యవస్థను ఏర్పాటు చేశామని సీఎం చంద్రబాబు అన్నారు.






