వంగవీటి రంగా విగ్రహానికి అవమానం.. సీఎం చంద్రబాబు సీరియస్

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-08-23 09:21:17  IST  )

ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం కలిదిండి, సానా రుద్రవరం గ్రామాల్లో వంగవీటి మోహన రంగా విగ్రహాలపై గత రాత్రి దుండగులు దాడి చేయడమే కాకుండా పేద పూశారు..

వంగవీటి రంగా విగ్రహానికి అవమానం.. సీఎం చంద్రబాబు సీరియస్
X

దిశ, వెబ్ డెస్క్: ఏలూరు జిల్లా(Eluru) కైకలూరు నియోజకవర్గం కలిదిండి, సానా రుద్రవరం గ్రామాల్లో వంగవీటి మోహన రంగా(Vangaveeti Mohana Ranga) విగ్రహాలపై గత రాత్రి దుండగులు దాడి చేయడమే కాకుండా పేడ పూశారు. దీంతో రాధా, రంగా మిత్రమండలి ఆగ్రహం వ్యక్తం చేసింది. నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. అయితే ఈ ఘటనలపై సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. వంగవీటి మోహన్ రంగా విగ్రహంపై దుశ్చర్యను ఆయన ఖండించారు. నిందితులను కఠినంగా వ్యవహరించాలని పోలీసులను ఆదేశించారు. నేత విగ్రహాలపై విధ్వేషానికి పాల్పడే వారికి గట్టిగా బుద్ధి చెప్పాలని సీఎం చంద్రబాబు సూచించారు. నిందితులను వెంటనే గుర్తించాలని చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.

Next Story