మొక్కజొన్న రైతులకు అండగా సీఎం చంద్రబాబు.. మద్దతు ధరపై కేంద్రానికి లేఖ

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-03-27 15:21:40  IST  )

రాష్ట్రంలోని మొక్కజొన్న రైతులకు సీఎం చంద్రబాబు అండగా నిలిచారు. మొక్కజొన్న పంటకు కనీస మద్దతు ధర కల్పించాలని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహన్‌కు లేఖ రాశారు.

మొక్కజొన్న రైతులకు అండగా సీఎం చంద్రబాబు.. మద్దతు ధరపై కేంద్రానికి లేఖ
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలోని మొక్కజొన్న రైతుల(Farmers)కు సీఎం చంద్రబాబు(CM Chandrababu) అండగా నిలిచారు. మొక్కజొన్న పంట(Maize Crop)కు కనీస మద్దతు ధర (MSP) కల్పించాలని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహన్‌(Union Agriculture Minister Shivraj Singh Chouhan)కు లేఖ రాశారు. మార్కెట్‌లో మద్దతు ధర లభించడంలేదని, దీని వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో మొక్కజొన్న రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు(Minister Atchannaidu) ఇటీవల ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. క్షేత్రస్థాయిలో ధరల పతనం వల్ల రైతులు పెట్టుబడి కూడా రాక ఇబ్బందులు పడుతున్న తీరును వివరించారు. మంత్రి అందించిన సమాచారంపై తక్షణమే స్పందించిన చంద్రబాబు.. రైతుల ప్రయోజనాలను కాపాడటమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొంటూ కేంద్రానికి ఈ లేఖ రాశారు.

మద్దతు ధర కల్పిస్తే..

కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి మద్దతు ధర కల్పిస్తే, రాష్ట్రంలోని వేలాది మంది రైతులకు ఆర్థిక వెసులుబాటు కలుగుతుందని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో కూడా వ్యవసాయ రంగాన్ని ఆదుకునేందుకు కేంద్రం అందించిన సహకారాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మొక్కజొన్న కొనుగోళ్ల విషయంలో కూడా ప్రత్యేక చొరవ చూపాలని శివరాజ్‌సింగ్ చౌహన్‌‌కు సీఎం చంద్రబాబు కోరారు.

Next Story