- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చిత్తూరు బస్సు ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి.. బాధిత కుటుంబాలకు భరోసా
చిత్తూరు బస్సు ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు.

దిశ, వెబ్‌డెస్క్: చిత్తూరు బస్సు ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. అనుకోని ప్రమాదంలో ఎనిమిది మంది మరణించడం బాధాకరం అన్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యారోగ్య శాఖను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని.. ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. కాగా, చిత్తూరు జిల్లా మొగిలి ఘాట్ దగ్గర ఓ బస్సు రెండు లారీలను ఢీ కొట్టింది. ఈ ఘటనలో 8 మంది వరకూ చనిపోయినట్లు తెలుస్తోంది. 30 మంది వరకూ గాయాలైనట్లు సమాచారం. గాయపడిన వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు. గాయపడిన వారిని దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు.






