రోడ్డు ప్రమాదంలో వ్యవసాయ కూలీల మృతి.. సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి

by Jakkula.Mamatha |

ఏపీ(Andhra Pradesh)లోని గుంటూరు జిల్లా(Guntur District)లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే.

రోడ్డు ప్రమాదంలో వ్యవసాయ కూలీల మృతి..  సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ(Andhra Pradesh)లోని గుంటూరు జిల్లా(Guntur District)లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ రోడ్డు ప్రమాదం(Road Accident) పై తాజాగా సీఎం చంద్రబాబు(CM Chandrababu) విచారం వ్యక్తం చేశారు. వ్యవసాయ కూలీలతో వెళ్తున్న ఆటో(Auto)ను బుడంపాడు సమీపంలో ఆర్టీసీ బస్సు(RTC Bus) ఢీకొంది. ఈ ఘటనలో ముగ్గురు మహిళా వ్యవసాయ కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు.

పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ముగ్గురు కూలీలు మృతి చెందడం పై సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. కూలి పనుల కోసం వెళ్తున్న మహిళలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విచారకరమన్నారు. మృతులు అరుణకుమారి, నాంచారమ్మ, సీతారావమ్మ కుటుంబాలను ఆర్థికంగా ఆదుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఈ క్రమంలో క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.

Next Story