- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నిరుపేదల చెంతకే నాణ్యమైన వైద్యం: సీఎం చంద్రబాబు
పేద ప్రజల ఆరోగ్యాన్ని సంరక్షించడమే ధ్యేయంగా ప్రభుత్వం సరికొత్త చర్యలు చేపడుతోందని సీఎం చంద్రబాబు అన్నారు. ఇందులో భాగంగానే అత్యాధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటూ 'సంజీవని' పేరుతో సరికొత్త డిజిటల్ హెల్త్ రికార్డు ప్రాజెక్టును తీసుకువస్తున్నట్లు ఆయన వెల్లడించారు..

దిశ, వెబ్ డెస్క్: పేద ప్రజల ఆరోగ్యాన్ని సంరక్షించడమే ధ్యేయంగా ప్రభుత్వం సరికొత్త చర్యలు చేపడుతోందని సీఎం చంద్రబాబు అన్నారు. ఇందులో భాగంగానే అత్యాధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటూ 'సంజీవని' పేరుతో సరికొత్త డిజిటల్ హెల్త్ రికార్డు ప్రాజెక్టును తీసుకువస్తున్నట్లు ఆయన వెల్లడించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని సరైన రీతిలో వాడుకోవడం ద్వారా వైద్య రంగంలో మెరుగైన, నాణ్యమైన ఫలితాలను సాధించవచ్చని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.
ఆరోగ్యం పట్ల ఎంతో అప్రమత్తంగా ఉండాలి
ప్రస్తుత కాలంలో శారీరక శ్రమ తగ్గి సుఖాలు పెరిగిన నేపథ్యంలో, ప్రజలంతా తమ ఆరోగ్యం పట్ల ఎంతో అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. నిత్య జీవితంలో మంచి అలవాట్లను అలవర్చుకోవడం ద్వారానే అనారోగ్య సమస్యలను దరిచేరకుండా చూసుకోవచ్చని ఆయన సూచించారు. శారీరక, మానసిక దృఢత్వానికి తోడ్పడే యోగా, ధ్యానం వంటి వాటికి తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని, మనం తీసుకునే పౌష్టికాహారమే మనల్ని రోగాల బారి నుంచి రక్షిస్తుందని చంద్రబాబు స్పష్టం చేశారు.
వాటన్నింటికీ విలువ ఉండదు: చంద్రబాబు
మనిషికి ఎంత సంపద ఉన్నా, ఉన్నతమైన పదవులు అనుభవిస్తున్నా.. సరైన ఆరోగ్యం లేకపోతే వాటన్నింటికీ విలువ ఉండదని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. వేల కోట్ల సంపద కంటే కూడా సంపూర్ణమైన ఆరోగ్యమే మనిషికి నిజమైన నిధి అని ఆయన గుర్తుచేశారు. ఆరోగ్యాన్ని కాపాడుకున్న వారే ఈ ప్రపంచంలో నిజమైన ధనవంతులని చెబుతూ, ప్రజలందరూ ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని చంద్రబాబు హితవు పలికారు.






