పేదలకు చంద్రబాబు గుడ్ న్యూస్.. ఇళ్ల నిర్మాణాలు, ప్రవేశాలపై కీలక ప్రకటన

by Vemula.Srinu Prasad |

రాష్ట్రంలో పేద ప్రజలకు నివాసం కల్పించాలనే లక్ష్యంగా పలు ప్రాంతాల్లో ప్రభుత్వం ఇళ్లు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఇళ్ల పంపిణీపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు...

పేదలకు చంద్రబాబు గుడ్ న్యూస్.. ఇళ్ల నిర్మాణాలు, ప్రవేశాలపై కీలక ప్రకటన
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో పేద ప్రజలకు నివాసం కల్పించాలనే లక్ష్యంగా పలు ప్రాంతాల్లో ప్రభుత్వం ఇళ్లు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఇళ్ల పంపిణీపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. సూళ్లూరుపేట పుదూరులో నిర్వహించిన సభలో ఆయన పాల్గొన్నారు. ఈ జూన్ నాటికి 2 లక్షల 70 వేల ఇళ్లలో, సెప్టెంబర్ నాటికి లక్షా 60 వేల ఇళ్లలో గృహ ప్రవేశం చేస్తామని తెలిపారు. అంతేకాకుండా మరో 12 లక్షల ఇళ్లు కూడా కట్టస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. అలాగే ఈ ఇళ్ల అన్నింటికీ పీఎన్‌జీ కనెక్షన్ అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. నీళ్ల ట్యాప్ మాదిరిగానే పీఎన్‌జీ కనెక్షన్స్ ఇస్తామని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అమరావతే మన రాజధాని అని తీర్మానం చేశామని, త్వరలోనే చట్టం తీసుకొస్తామన్నారు. చట్టం వచ్చిన తర్వాత రాజధానిని ఎవరూ కదిలించలేరని చెప్పారు. హైదరాబాద్, చెన్నై కంటే మెరుగ్గా అమరావతిని అభివృద్ది చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. చేపటలను స్థానిక మత్య్సకారులే పట్టుకోలని, నష్టం కలిగిస్తే సహించమని చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు.

Next Story