జనవరి 1 నుంచి క్వాంటమ్ వ్యాలీ కార్యక్రమం: సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-06-30 08:09:43  IST  )

జనవరి 1 నుంచి అమరావతిలో క్వాంటం వ్యాలీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు...

జనవరి 1 నుంచి క్వాంటమ్ వ్యాలీ కార్యక్రమం: సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: జనవరి 1 నుంచి అమరావతి(Amaravati)లో క్వాంటమ్ వ్యాలీ(Quantum Valley) కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. విజయవాడ(Vijayawada)లో ఏర్పాటు చేసిన అమరావతి క్వాంటమ్ వ్యాలీ నేషనల్ వర్క్ షాపులో స్టార్టప్ కంపెనీల ఎగ్జిబిషన్‌ను సీఎం చంద్రబాబు(Cm Chandrababu) ప్రారంభించారు. ఈ సందర్బంగా సీఎం మాట్లాడుతూ అమెరికాలోని సిలికాన్ వ్యాలీని ఆదర్శంగా తీసుకుని అమరావతిలో క్వాంటమ్ వ్యాలీని ఏర్పాటు చేస్తున్నామన్నారు. తద్వారా లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పారు. టెక్నాలజీ వినియోగంలో మన దేశీలయులదే కీలక పాత్ర అని చెప్పారు. ఏఐ, డీప్ టెక్నాలజీదే భవిష్యత్తు అని చెప్పారు. జనవరి 1 తర్వాత అమరావతి నుంచి క్వాంటమ్ కంప్యూటింగ్ కార్యక్రమాలు ప్రారంభమవుతాయని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో డ్రోన్ సిటీని ఏర్పాటు చేయబోతున్నామన్నారు. రాష్ట్రంలో ఆగస్టు 15 తర్వాత వాట్సాప్ ద్వారానే అన్ని ప్రభుత్వ సర్వీసులు అందించనున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు.

Next Story