జీరో స్థాయికి తగ్గించాలి: CM చంద్రబాబు ఆదేశం

by Gantepaka Srikanth |

అన్ని రకాల ప్లాస్టిక్ వ్యర్థాలను డిస్పోజ్ చేసేందుకు ఓ విధాన నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandrababu) అధికారులను ఆదేశించారు.

జీరో స్థాయికి తగ్గించాలి: CM చంద్రబాబు ఆదేశం
X

దిశ, వెబ్‌డెస్క్: అన్ని రకాల ప్లాస్టిక్ వ్యర్థాలను డిస్పోజ్ చేసేందుకు ఓ విధాన నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandrababu) అధికారులను ఆదేశించారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డుతో సహా వివిధ శాఖల అధికారులతో సోమవారం సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో కాలుష్యాన్ని నెట్ జీరో స్థాయికి తగ్గించాలి. గాలి, నీరు, ఇండస్ట్రీయల్ వేస్ట్, బయో వేస్ట్, ప్లాస్టిక్ వేస్ట్ వంటి వాటిల్లో వివిధ రకాల అధ్యయనం చేయాలి. ఇందు కోసం టెక్నాలజీని వినియోగించాలి. ఎవరైనా నియమాలను అతిక్రమిస్తే సదరు సంస్థలు వ్యక్తులకు ముందుగా హెచ్చరికలు జారీ చేసి ఆ తర్వాత చర్యలు తీసుకోవాలి అని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పట్టణాభివృద్ధి, పంచాయతీరాజ్, వైద్యారోగ్య శాఖలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

అంతకుముందు నూతనంగా ఏర్పాటు చేయనున్న ‘‘ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టం’’పై సీఎం చంద్రబాబు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. రియల్ టైమ్ గవర్నెన్సు డేటా లేక్ ద్వారా వివిధ సంక్షేమ పథకాలు, ప్రభుత్వం అందిస్తున్న వివిధ పౌర సేవల అమలు తీరును పర్యవేక్షించేలా ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టం ఉంటుంది. ఈ సమీక్షా సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్, ఆర్ధిక, వైద్యారోగ్యం, పౌరసరఫరాలు, పురపాలక, ఐటీ, ప్లానింగ్ విభాగం ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Next Story