- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Ap: 4 శాఖలపై సీఎం రివ్యూ.. కీలక ఆదేశాలు జారీ
నాలుగు శాఖలపై సీఎం చంద్రబాబు నాయుడు రివ్యూ నిర్వహించి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ...

దిశ, వెబ్ డెస్క్: ఏపీ ప్రభుత్వం(AP Govt) అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సూపర్ సిక్స్ పథకాల(Super Six Schemes)పై దృష్టి పెట్టిన విషయం తెలిసిందే. ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తోంది. మరికొన్ని రోజుల్లో పలు పథకాలను అమలు చేసేందుకు ఇప్పటి నుంచే కసరత్తులు చేస్తోంది. అయితే ఇప్పటికే అమలు చేసిన పథకాలు అమలు, ప్రభుత్వ కార్యక్రమాలపై ప్రజలు ఏమనుకుంటున్నారనే అంశంపై సీఎం చంద్రబాబు నాయుడు ప్రతి నెలా తెలుసుకుంటున్నారు. అధికారుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా సీఎం చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) ఈ రోజు నాలుగు శాఖపై సమీక్ష నిర్వహించారు. వివిధ పథకాల అమలులో లబ్దిదారుల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా అధికారులతో రివ్యూ నిర్వహించారు. ప్రభుత్వ సేవల్లో నాణ్యత పెంచడం, ప్రజలు సంతృప్తి చెందేలా కార్యక్రమాల అమలు ప్రధాన లక్ష్యంగా పని చేయాలని అధికారులకు సీఎం సూచించారు.
ఈ వారం రెవెన్యూ సర్వీసులు, ఆసుపత్రుల్లో సేవలు, దేవాలయాలు, మున్సిపల్ శాఖలోని సేవల్లో వచ్చిన రిపోర్టులపై చంద్రబాబు సమీక్షించారు. పదేపదే ఫిర్యాదులు వస్తున్న విభాగాల్లో బాధ్యులను గుర్తించి మార్పు వచ్చేలా చూడాలని అధికారులను ఆదేశించారు. కిందిస్థాయి ఉద్యోగులు, అధికారులకు ఉన్నతాధికారులు కౌన్సిలింగ్ నిర్వహించడం ద్వారా సేవలు మెరుగుపరచాలని సూచించారు. ప్రభుత్వ శాఖల్లో అవినీతి విషయంలో ఏమాత్రం సహించవద్దన్నారు. కరెప్షన్ అనేది ఒక జబ్బులాంటిదని, దాన్ని పూర్తిగా నివారించాల్సిందేనని అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు.






