ప్రధాని మోడీ పర్యటనను గ్రాండ్ సక్సెస్ చేద్దాం.. CM చంద్రబాబు పిలుపు

by Gantepaka Srikanth |

ప్రధాని మోడీ(PM Modi) ఏపీ పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandrababu) టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ప్రధాని మోడీ పర్యటనను గ్రాండ్ సక్సెస్ చేద్దాం.. CM చంద్రబాబు పిలుపు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రధాని మోడీ(PM Modi) ఏపీ పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandrababu) టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. మంత్రులు, కూటమి ప్రజాప్రతినిధులు, అధికారులతో మాట్లాడారు. ప్రధాని పర్యటనను విజయవంతం చేయాలని నేతలకు పిలుపునిచ్చారు. డబుల్ ఇంజిన్ సర్కార్ విధానాలతో రాష్ట్రానికి అనేక ప్రయోజనాలు చేకూరుతున్నాయి. పాలసీలు, సంక్షేమ కార్యక్రమాలతో రాష్ట్రానికి పెద్దఎత్తున లాభం చేకూరుతోందని అన్నారు. ఏపీలో గూగుల్ ఏఐ డేటా హబ్ ఏర్పాటు చేసేందుకు ఢిల్లీలో నిన్న గూగుల్ సంస్థతో ఒప్పందం చేసుకున్నాం. ఇది చారిత్రాత్మక నిర్ణయమని చెప్పారు. 1998లో మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ రాకతో ఐటీ ఎకో సిస్టం ఏర్పడి.. నాలెడ్జి ఎకనామీకి పునాది పడిందని అన్నారు. ఏపీకి గూగుల్ డేటా హబ్ రావటంలో ప్రధాని మోడీ, కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్, అశ్వనీ వైష్ణవ్ చొరవ ఉందని చెప్పారు.

గూగుల్ రావడానికి ఐటీ మంత్రి లోకేష్(Nara Lokesh) ప్రధాన పాత్ర పోషించారని అభినందించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే గూగుల్ ప్రతినిధులతో సంప్రదించి రాష్ట్రానికి వచ్చేలా చేశారని అన్నారు. అతిపెద్ద ఏఐ డేటా హబ్ ఏర్పాటుకు 15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో గూగుల్ ముందుకు వచ్చిందని వెల్లడించారు. దేశంలోనే ఇది అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి పెట్టుబడని అన్నారు. విభజనతో ఎదుర్కోన్న ఇబ్బందుల కంటే గత పాలకులు చేసిన విధ్వంసంతో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని కీలక వ్యాఖ్యలు చేశారు. పాలనా పరంగా అనేక తప్పులు చేశారు.. వాటిని సరి చేయడానికే చాలా సమయం పట్టిందని అన్నారు. కేంద్రం సహకారంతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను క్రమంగా అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. కూటమి నేతలంతా కలిసి ఓ మోడల్ స్టేట్‌గా రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలపాలని పిలుపునిచ్చారు. ప్రధాని మోడీ రాకతో శ్రీశైల క్షేత్రానికి ఒక మహర్ధశ రాబోతోంది. తిరుమల తర్వాత జ్యోతిర్లింగం, శక్తిపీఠం ఉన్న క్షేత్రంగా శ్రీశైలం అభివృద్ధి చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు.

Next Story