అసాధారణ వ్యక్తిత్వం ఆయన సొంతం: CM చంద్రబాబు

by Gantepaka Srikanth |

పేద కుటుంబంలో జన్మించి దేశానికి రాష్ట్రపతిగా అత్యున్నత స్థాయిలో సేవలు అందించిన అబ్దుల్ కలాంను ఏపీ సీఎం చంద్రబాబు(CM Chandrababu) గుర్తుచేసుకున్నారు.

అసాధారణ వ్యక్తిత్వం ఆయన సొంతం: CM చంద్రబాబు
X

దిశ, వెబ్‌డెస్క్: పేద కుటుంబంలో జన్మించి దేశానికి రాష్ట్రపతిగా అత్యున్నత స్థాయిలో సేవలు అందించిన అబ్దుల్ కలాంను ఏపీ సీఎం చంద్రబాబు(CM Chandrababu) గుర్తుచేసుకున్నారు. ఇవాళ కలాం జయంతి(Abdul Kalam Jayanthi) సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ట్వీట్ పెట్టారు. ‘‘శాస్త్రవేత్తగా, భారత రాష్ట్రపతిగానే కాకుండా అరుదైన గొప్ప వ్యక్తిత్వం కలిగిన మహానుభావుడిగా చరిత్రలో నిలిచిపోయారు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. పరిణతి, మానవతా విలువలను సమన్వయం చేసిన అసాధారణ వ్యక్తిత్వం ఆయన సొంతం. దేశ అణు మరియు శాస్త్ర సాంకేతిక రంగాలకు సరికొత్త దిశను చూపిన ఆ దార్శనికుడి జయంతి సందర్భంగా ఆయన దేశ, సమాజ సేవలను స్మరించుకుందాం’’ అని చంద్రబాబు ట్వీట్‌లో పేర్కొన్నారు. కాగా, 1931 అక్టోబరు 15న తమిళనాడులోని రామేశ్వరంలో అబ్దుల్ కలాం జన్మించిన విషయం తెలిసిందే. అంతరిక్ష, క్షిపణి పరిజ్ఞానాల స్వావలంబనలో కలాం కీలక భూమిక పోషించారు. ట్వీట్

Next Story