- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టీడీపీ మహానాడు.. కడపకు చేరుకున్న సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కడపకు చేరుకున్నారు. టిడిపి మహానాడు కార్యక్రమం ప్రారంభం

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కడపకు చేరుకున్నారు. టిడిపి మహానాడు కార్యక్రమం ప్రారంభం కానున్న నేపథ్యంలోనే.. కాసేపటి క్రితమే కడప జిల్లాకు చేరుకున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. అటు తెలుగుదేశం పార్టీ మహానాడు వేడుకలకు సర్వం సిద్ధమైంది. ఈ వేడుకలు మంగళవారం నుంచి మూడు రోజులపాటు కొనసాగనున్నాయి.
మూడు రోజులపాటు జరిగే ఈ టిడిపి మహానాడు ఏర్పాట్లను... అగ్ర నేతలు దగ్గరుండి చూసుకుంటున్నారు. మంగళవారం నుంచి ప్రారంభం కానున్న ఈ వేడుకల నేపథ్యంలో... తాజాగా టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు కడప చేరుకున్నారు. మూడు రోజులపాటు జరగనున్న ఈ కార్యక్రమం నేపథ్యంలో కడప జిల్లా మొత్తం పసుపు మాయమైంది.
స్వచ్ఛతకు ప్రాధాన్యత ఇస్తూ స్వచ్ఛ మహానాడు, జీరో వేస్ట్ ఈవెంట్ గా నిర్వహించబోతున్నారు. రాయలసీమ అభివృద్ధి అలాగే కడప ఉక్కు పరిశ్రమపై ఈ మహానాడులో కీలక ప్రకటనలు సీఎం చంద్రబాబు నాయుడు ద్వారా వెలువడే ఛాన్సులు ఉన్నాయి. అదే సమయంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి వైఫై చేయాలను కూడా ఈ సందర్భంగా ఎండగట్టనున్నారు.






