- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- వైరల్
CM Chandrababu: రాయలసీమ రుణం తీర్చుకుంటా.. సీఎం చంద్రబాబు ఎమోషనల్ కామెంట్స్

దిశ, వెబ్‌వెస్క్: ఎన్టీఆర్ (NTR) అంటేనే స్ఫూర్తి, ఆదర్శమని సీఎం చంద్రబాబు (CM Chandrababu) అన్నారు. ఇవాళ కడప (Kadapa) జిల్లా మైదుకూరు (Maidukuru)లో స్వచ్ఛ ఆంధ్ర.. స్వచ్ఛ దివస్ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలుగు జాతి కోసం పరితపించిన నాయకుడు ఎన్టీఆర్ అని అన్నారు. ఆయన పేరు కోట్లాది నిరుపేదల గుండెల్లో తీపి జ్ఞాపకమని కొనియాడారు. పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి రావడం ఆయనకు ఒక్కడికే సాధ్యం అయిందని అన్నారు. పేదరికం లేని సమాజం కేవలం టీడీపీ (TDP)తోనే సాధ్యమని.. అది కూడా త్వరలోనే చేసి చూపిస్తామని అన్నారు. రతనాల సీమ రాయలసీమ (Rayanaseema)కు కాంగ్రెస్ (Congress) సహా మిగిలిన పార్టీలు చేసిందేమి లేదన్నారు.
టీడీపీ (TDP) తప్ప మరే పార్టీ హయాంలోనూ కడపలో అభివృద్ధి జరగలేదని అన్నారు. నదులు అనుసంధానం పూర్తి అయితే.. అభివృద్ధిలో రాయలసీమ పరుగులు పెట్టడం ఖాయమని తెలిపారు. వైసీపీ సర్కార్ (YCP Government) పోలవరాన్ని గోదావరిలో ముంచేసిందని.. మళ్లీ తాము అధికారంలోకి వచ్చి పోలవరాన్ని పట్టాలెక్కించామని, డయాఫ్రం వాల్ (Diaphragm Wall) నిర్మాణాన్ని ప్రారంభించామని గుర్తు చేశారు. కొప్పర్తి ఇండస్ట్రియల్ కారిడార్ (Kopparthi Industrial Corridor) పూర్తి చేసి ఉపాధి కల్పిస్తామని అన్నారు. అదేవిధంగా కడప స్టీల్ ప్లాంట్ (Kadapa Steel Plant)ను కూడా పూర్తి చేస్తామని మాటిచ్చారు. రాయలసీమ (Rayalaseema) రుణం తీర్చుకునేందుకే పోలవరం-బనకచర్ల ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నామని తెలిపారు. ఆ ప్రాజెక్ట్ పూర్తి అయితే రాష్ట్రం మొత్తం సస్యశ్యామలం అవుతుందని చంద్రబాబు అన్నారు. ఈ నెల చివర్లో వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొస్తున్నామని.. ప్రజలు ఇక ఆఫీసులకు వెళ్లే పని లేదని.. ఆఫీసులే ప్రజలకు వద్దకు వచ్చేలా చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు.