- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సర్దార్ వల్లభాయ్ పటేల్ కు సీఎం చంద్రబాబు నివాళి
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు క్యాంప్ కార్యాలయంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు.

దిశ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు క్యాంప్ కార్యాలయంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి సీఎం చంద్రబాబు (CM Chandra Babu) పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. జాతీయ ఐక్యతా దినోత్సవం (National Intergrity Day) పురస్కరించుకొని దేశానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. ప్రజలంతా దేశ ఐక్యత, సమగ్రతను కాపాడేందుకు ఏకతాటిపై నడవాలని సీఎం కోరారు.
సర్దార్ వల్లభాయ్ పటేల్ స్వతంత్ర సమరయోధులు. స్వతంత్ర భారతదేశంలో తొలి ఉప ప్రధానమంత్రిగా పనిచేశారు. హోంమంత్రిగా బాధ్యతలను నిర్వర్తించారు. తన హయాంలో విభిన్న భాగాలుగా ఉన్న భారత దేశాన్ని ఏకం చేసేందుకు ఎంతో నిబద్ధతతో పని చేశారు. నేటి స్వతంత్ర భారతం ఒక రూపును సంతరించుకోవడానికి ప్రధాన కారణంగా నిలిచారు. ఉక్కు మనిషిగా, సమైక్యతా స్ఫూర్తికి నిలువెత్తు రూపంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ ను ప్రజలు ఆరాధిస్తారు. ఆయన జయంతిని పురస్కరించుకొని భారత ప్రభుత్వం ప్రతి ఏడాది రాష్ట్రీయ ఏక్తా దివస్ ను దేశవ్యాప్తంగా నిర్వహిస్తోంది.






