- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎస్ జానకి మరణం పట్ల సీఎం చంద్రబాబు, ఏపీ మంత్రుల సంతాపం
by Naga Rani Yarlagadda |
స్వరసరస్వతి, ప్రముఖ గాయని ఎస్. జానకి (88) మృతి పట్ల ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారాలోకేశ్ లు సంతాపం తెలిపారు.

X
దిశ, వెబ్‌డెస్క్: స్వరసరస్వతి, ప్రముఖ గాయని ఎస్. జానకి (88) మృతి పట్ల ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారాలోకేశ్ లు సంతాపం తెలిపారు. దక్షిణాది గానకోకిల జానకి మరణవార్త తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. అసమైనమైన ప్రతిభతో, తన అమరగానంతో ఎన్నో తరాలను మురిపించిన ఆ గాత్రం మూగబోవడం బాధాకరమన్నారు. సంగీత ప్రపంచానికి ఆమె అందించిన సేవలు శాశ్వతంగా ఉంటాయన్నారు. జానకి ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. జానకి కుటుంబ సభ్యులు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Next Story






