- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘బనకచర్ల’ విషయంలో మొత్తం తెలంగాణ ఏకమై మాట్లాడుతోంది.. CM చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
బనకచర్ల ప్రాజెక్ట్(Banakacharla Project)పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandrababu) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: బనకచర్ల ప్రాజెక్ట్(Banakacharla Project)పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandrababu) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన మంత్రులతో సచివాలయం వేదికగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పోలవరం బనకచర్లపై తెలంగాణ(Telangana) వాళ్లు అందరూ ఏకమై మాట్లాడుతున్నారు.. మనం కూడా మన వాదన వినిపించాలని మంత్రులకు సూచించారు. తెలంగాణలో వాళ్లు అనుమతి లేని ప్రాజెక్టులు ఎన్నో కడుతున్నారు.. వాళ్లు వాడుకోగా మిగిలిన నీళ్లే మనం వాడుకుంటున్నాం.. ఈ విషయాన్ని రెండు రాష్ట్రాల ప్రజలకు క్లియర్‌గా అర్ధం చేయించాలి. ఈ అంశాన్ని వాళ్లు రాజకీయం చేస్తున్నారు.. దానికి ముందే మనం ప్రజలకు అర్థమయ్యే రీతిలో మనం వివరించాలని మంత్రులకు సీఎం చంద్రబాబు సూచించారు. మరోవైపు.. బనకచర్ల ప్రాజెక్టుపై ఏ విధంగా ముందుకెళ్లాలనే విషయమై సోమవారం నిర్వహించిన తెలంగాణ మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రాజెక్ట్‌ను అంగీకరించేది లేదని తేల్చి చెప్పారు. అడ్డుకొని తీరాలని నిర్ణయించారు. తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా ఆంధ్రప్రదేశ్సర్కార్ వ్యవహరిస్తున్నదని, ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు కేంద్రానికి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.






