నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. కారణం ఇదే

by velandi.Saikiran |

ఆంధ్రప్రదేశ్ (AP) రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu) మరోసారి ఢిల్లీ ( Delhi) పర్యటనకు వెళ్లానున్నా

నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. కారణం ఇదే
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ (AP) రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu) మరోసారి ఢిల్లీ ( Delhi) పర్యటనకు వెళ్లానున్నారు. ఇవాళ రాత్రి... ఢిల్లీ పర్యటనకు బయలుదేరుతారు సీఎం చంద్రబాబు నాయుడు. గత నెలలో ఢిల్లీకి వెళ్లిన సీఎం చంద్రబాబు.... ఇప్పుడు మళ్లీ వెళ్తున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా పయనం అవుతున్నారు. ఈ సందర్భంగా... పలువురు కేంద్ర మంత్రులు అలాగే వ్యాపారవేత్తలతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సమావేశం కాబోతున్నారు.

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో... కేంద్రం సహాయం కోరెందుకు రేపు ఒక్కరోజు ఏకంగా ఏడుగురు కేంద్ర మంత్రులతో సమావేశం కాబోతున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడుల అంశంపై.. సాయంత్రం వ్యాపారవేత్తలను కలుస్తారు. ఇక ఈ నెల 24వ తేదీన నీతి ఆయోగ్ పాలకమండలి ( NITI Aayog Governing Council) సమావేశంలో కూడా సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు.

ఆ రోజున తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఇక నెల వ్యవధిలో... ఢిల్లీకి చంద్రబాబు నాయుడు రెండోసారి వెళ్తున్నారు. ఇది ఇలా ఉండగా.. రెండు రోజుల కిందట ఏపీ కేబినెట్ సమావేశమైన సంగతి తెలిసిందే. తన ఢిల్లీ పర్యటన నేపథ్యంలో... ఏ ఏ అంశాలపై కేంద్ర మంత్రులతో చర్చించాలనే నివేదికను కూడా.. ఆ కేబినెట్ సమావేశంలో మంత్రులతో చర్చించారు చంద్రబాబు నాయుడు. సరిగ్గా మంత్రివర్గ సమావేశం అయిపోయిన రెండు రోజుల తర్వాత ఢిల్లీ వెళ్తున్నారు.

Next Story