ఇవాళ తిరుపతిలో సీఎం చంద్రబాబు పర్యటన

by velandi.Saikiran |

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu) ఇవాళ తిరుపతికి (Tirupathi) వెళ్లనున్నారు. ప్రస్తుత

ఇవాళ తిరుపతిలో సీఎం చంద్రబాబు పర్యటన
X

దిశ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu) ఇవాళ తిరుపతికి (Tirupathi) వెళ్లనున్నారు. ప్రస్తుతం అమరావతిలో ఉన్న సీఎం చంద్రబాబు.. తిరుపతిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. ఇందులో భాగంగానే తూకివాకంలోని ఇంటిగ్రేటెడ్ మేనేజ్మెంట్ యూనిట్ ( Integrated Management Unit) పరిశీలించనున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఇక నేడు మధ్యాహ్నం కపిలతీర్థం ( kapilatheertham) ఆలయానికి సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు. అనంతరం ప్రజావేదికలో పాల్గొననున్నారు. ఇవాళ సాయంత్రం 4 గంటలకు అలిపిరి కంచి పీఠం సందర్శన చేయనున్నారు. అనంతరం తిరుగు ప్రయాణం చేయనున్నారు. ఈ మేరకు షెడ్యూల్ ఖరారు అయింది.

Next Story