నేడు పల్నాడు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన

by Ajay Maddhiboyina |

సీఎం చంద్రబాబు నేడు పల్నాడు జిల్లాలో పర్యటించనున్నారు. వినుకొండ పట్టణంలోని ఎన్ ఎస్సీ మైదానంలో నిర్వహించే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు.

నేడు పల్నాడు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన
X

దిశ, వెబ్ డెస్క్: సీఎం చంద్రబాబు నేడు పల్నాడు జిల్లాలో పర్యటించనున్నారు. వినుకొండ పట్టణంలోని ఎన్ ఎస్సీ మైదానంలో నిర్వహించే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. స్వచ్ఛ రథాలను ప్రారంభించి అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 3.05గంటలకు టీడీపీ కార్యకర్తలతో భేటీ అవుతారు. సాయంత్రం 4.35 గంటలకు ప్రభుత్వాస్పత్రికి చేరుకుని బయో మెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ పరిశీలిస్తారు. సాయంత్రం 5.15 గంటలకు హెలికాప్టర్ లో బయలుదేరి ఉండవల్లి నివాసానికి చేరుకుంటారు. సీఎం రాక నేపథ్యంలో ఇప్పటికే వినుకొండలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఇక సీఎం సభకు అభిమానులు, కార్యకర్తలు పెద్దఎత్తున హాజరయ్యేందుకు సిద్ధం అవుతున్నారు.

Next Story