- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చిత్తూరు జిల్లా నగరిలో సీఎం చంద్రబాబు పర్యటన
బిజీబిజీ సాగుతున్న సీఎం నగరి పర్యటన.

దిశ, వెబ్ డెస్క్ : చిత్తూరు జిల్లాలోని నగరికి సీఎం చంద్రబాబు నాయుడు చేరుకున్నారు. అక్కడ జరుగుతున్న స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను సీఎం సందర్శించారు. తొలుత ఈ వేస్ట్ రిసైక్లింగ్ స్టాల్ ను సందర్శించారు. స్టాల్ వద్దనున్న సంస్థ సిబ్బంది అందుకు సంబంధించిన వివరాలను సీఎంకు తెలిపారు. సీఎం మాట్లాడుతూ స్వచ్ఛ రథాల్లో ఈ-వేస్ట్ సేకరణకు కూడా స్థానం కల్పించాలని అధికారులకు సూచించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఉన్న 47 యూఎల్బీల ద్వారా ఈ-వేస్ట్ ప్రత్యేకంగా సేకరిస్తున్నట్లు అధికారులు సీఎంకు తెలిపారు.
ప్లాస్టిక్ వేస్ట్ నుంచి ప్లాక్టిక్ ఇటుకలు తయారు చేసే యూనిట్ మైసూరులో ఉందని.. దాన్ని ఏపీకి రావాల్సిందిగా కోరుతున్నామని అధికారులు చెప్పారు. తాము తయారు చేసే ఎం60 గ్రేడ్ ఇటుకలు 2కేజీల బరువు ఉంటాయని స్టాల్ సిబ్బంది సీఎంకు వివరించారు. 4 టన్నుల ప్లాస్టిక్ ఇటుకల తయారీ యూనిట్ నిర్వహణలో ఉందని పేర్కొన్నారు. అయితే అందుకు ఎన్ని టన్నుల ముడిసరుకు అవసరం పడుతుందని.. పెద్ద ఎత్తున చేపట్టడానికి ఎంత ఖర్చవుతుందని సిబ్బందిని సీఎం ప్రశ్నించారు. రోజుకు 4 టన్నుల ముడి సరుకుతో ఇటుకల ఉత్పత్తి చేయగలమని చెప్పారు. అందుకు స్పందించిన సీఎం తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. చిత్తూరులో పైలట్ ప్రాజెక్ట్ కింద ప్రారంభానికి సంస్థతో ఒప్పందం చేసుకున్నారు. అయితే ప్రాజెక్ట్ కార్బన్ ప్రింట్ ద్వారా వచ్చే ప్రయోజనాలకు మెప్మాలోని మహిళా బృందాలకు కంపెనీ అందిస్తుందని అధికారులు ఈ సందర్భంగా సీఎంకు తెలియజేశారు.
అనంతరం సీఎం మ్యాజిక్ డ్రైన్స్ సిస్టం స్టాల్ ను పరిశీలించారు. ఉపాధి హామీ పథకం కింద ఈ పనులను చేపడుతున్నట్లు స్టాల్ లో ఉన్న సిబ్బంది సీఎంకు తెలిపారు. పైలట్ ప్రాజెక్ట్ కింద 4 గ్రామాల్లో 1.75 కిలోమీటర్ల మేర మ్యాజిక్ డ్రైన్స్ లైన్లు వేసినట్లు పేర్కొన్నారు. 10 మీటర్ల లైన్ వేయడం రూ.79వేల ఖర్చవుతుందన్నారు. పదిహేను రోజుల్లో కిలోమీటర్ పనులు అవుతాయని తెలియజేశారు.
చిత్తూరులో గ్రీన్ కవరేజ్ గురించి మరో స్టాల్ ను సందర్శించి సీఎం తెలుసుకున్నారు. అక్కడి సిబ్బంది చిత్తూరులో 34శాతం గ్రీన్ కవరేజ్ ఉందని సీఎంకు తెలియజేశారు. 2047 నాటికి 50 శాతం గ్రీన్ కవరేజ్ సాధించే లక్ష్యంతో పని చేస్తున్నామని అన్నారు.






