Amaravati: రైతులతో సీఎం చంద్రబాబు భేటీ.. కీలక అంశాలపై చర్చ

by Vemula.Srinu Prasad |

అమరావతి రైతులతో సీఎం చంద్రబాబు భేటీ కొనసాగుతోంది..

Amaravati: రైతులతో సీఎం చంద్రబాబు భేటీ..  కీలక అంశాలపై చర్చ
X

దిశ, వెబ్ డెస్క్: రాజధాని అమరావతి(Amaravati) రైతులతో సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu) కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలువురు అధికారులు సైతం పాల్గొన్నారు. రాజధాని ప్రాంతానికి 30 వేల ఎకరాలు ఇచ్చిన రైతులతో ఉండవల్లి నివాసం(Undavalli House)లో చంద్రబాబు సమీక్ష నిర్వహిస్తున్నారు. అమరావతి నిర్మాణ పున: ప్రారంభం నేపథ్యంలో ప్రధాని మోడీ రాష్ట్ర పర్యటించనున్న విషయం తెలిసిందే. అయితే మోడీ పర్యటనపైనే సమావేశంలో కీలకంగా చర్చిస్తున్నారు. ప్రధాని మోడీతో చేయించే శంకుస్థాపనలపైనా చర్చకు వచ్చింది. ఇప్పటి వరకూ రూ. 60 వేల కోట్లతో అమరావతి నిర్మాణ పనులకు టెండర్లు పిలిచారు. ఇందులో రూ.49 వేల కోట్లకు సంబంధించిన టెండర్లు ఖరారు అయ్యాయి. ఈ పనులకు సంబంధించి మాత్రమే ప్రధాని మోడీతో శంకుస్థాపన చేయించాలా?.. ఇతర పనులకు కూడా శంకుస్థాపన చేయించాలనే అంశాలపై చర్చిస్తున్నారు. ఈ భేటీ ముగిసే సమయానికి ఈ అంశాలపై కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. రాజధానికి భూముల్చిన 29 గ్రామాలకు సంబంధించిన కొంతమంది రైతులను ఈ పున: ప్రారంభ పనుల్లోనూ భాగస్వాములను చేయాలని సీఎం చంద్రబాబు ఇప్పటికే నిర్ణయించారు. ఇందుకు అనుగుణంగా ఎంపిక చేసుకున్న కొంతమంది రైతులను తన నివాసానికి పిలిపించి ఈ సమావేశంలో చర్చలు జరుపుతున్నారు. ప్రధాని మోడీ పర్యటన సందర్భంగా రైతుల పాత్ర ఏ విధంగా ఉండాలనేదానిపై దిశానిర్దేశం చేస్తున్నారు.

కాగా ప్రధాని మోడీ(Pm Modi) మే2న ఢిల్లీ నుంచి నేరుగా విమానంలో గన్నవరం చేరుకుంటారు. అక్కడి నుంచి విజయవాడ సిటీ చేరుకుంటారు. అనంతరం కారులో దాదాపు 1.1 కిలో మీటర్ల మేర ప్రజలకు అభివాదం చెప్పుకుంటూ వేదిక వద్దకు చేరుకుంటారు. దీంతో రైతులతో ఘన స్వాగతం పలికించాలా లేదా... ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేయాలా అనే అంశాలపైనా సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష జరుపుతున్నారు.

Next Story