- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Chandrababu: నేను వెంకటేశ్వర స్వామిని చూశాను
అమరావతిలోని వెంకటపాలెంలో వేంకటేశ్వరస్వామి ఆలయ(Tirumala Temple) విస్తరణకు సీఎం చంద్రబాబు గురువారం భూమిపూజ చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: అమరావతిలోని వెంకటపాలెంలో వేంకటేశ్వరస్వామి ఆలయ(Tirumala Temple) విస్తరణకు సీఎం చంద్రబాబు గురువారం భూమిపూజ చేశారు. రూ.260 కోట్లతో రెండు దశల్లో పనులు చేపట్టనున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘నేను వెంకటేశ్వర స్వామిని చూశాను.. మనము ఈ జన్మలో పాపం చేస్తే మరో జన్మలో శిక్ష పడుతుందని అంటారు.. కానీ వెంకటేశ్వర స్వామి మాత్రం ఈ జన్మలోనే శిక్షిస్తాడు.. ఇది నా అనుభవం’’ అని చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. దేవతల రాజధాని ఎలా ఉంటుందో.. అదే నమూనాతో ఏపీ రాజధాని అమరావతి ఉంటుందని అన్నారు. రాజధాని కోసం రైతులు 33వేల ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చారని, పవిత్ర కార్యక్రమానికి రైతులు సహకరించారని అభినందించారు. కాగా, 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వం శ్రీవారి ఆలయాన్ని రూ.185 కోట్లతో అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేయగా.. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ.. దానిని రూ.36 కోట్లకు కుదించింది. తాజాగా అధికారంలోకి వచ్చిన కూటమి.. ఆలయాన్ని 2014-19 నాటి ప్రణాళికను మించి సకల హంగులతో అభివృద్ధి చేసేందుకు అడుగు ముందుకేసింది. వీడియో






