- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీ ప్రజలకు చంద్రబాబు వీడియో సందేశం
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandrababu) కీలక పిలుపునిచ్చారు.

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandrababu) కీలక పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. ‘‘కోట్లాది మంది భారతీయుల్ని ఏకం చేసే ఏకైక నినాదం వందేమాతరం(Vande Mataram). వందేమాతర గేయం యావత్ భారత సంస్కృతి సంప్రదాయాలకు, భౌగోళిక స్వరూపానికి ప్రతీక. 150 ఏళ్లు పూర్తి చేసుకున్న ఈ గేయాన్ని నిత్యం మననం చేసుకుంటూ భిన్నత్వంలోనే ఏకత్వం ఉందని నిరూపిద్దాం. ప్రధాని నరేంద్ర మోడీ నిర్దేశించినట్టుగా మనం అంతా కలిసి 150 ఏళ్ల వందేమాతర గేయం ఉత్సవాలను నిర్వహించుకుందామని పిలుపు ఇస్తున్నాను’’ అని చంద్రబాబు పేర్కొన్నారు. మరోవైపు ఇవాళ విజయవాడ కేబీఎన్ కళాశాలలో రెండు వేల మంది విద్యార్ధులతో సామూహిక గేయాలపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎమ్మెల్యే సుజనాచౌదరి, ఎన్టీఆర్ జిల్లా కలెక్టరు డాక్టరు జి.లక్ష్మీశ, రాష్ట్ర సాంస్కృతిక, సృజనాత్మక కమిషన్ అధ్యక్షురాలు పొడపాటి తేజస్విని, ఏపీ నాటక అకాడమీ ఛైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ, సాంస్కృతికశాఖ రాష్ట్ర సంచాలకులు ఆర్.మల్లికార్జున రావుతోపాటు కళాశాల నిర్వాహకులు గేయాలాపనలో పాల్గొన్నారు.






