- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సింగపూర్ పర్యటన వేళ CM చంద్రబాబు కీలక ప్రకటన
సింగపూర్ పర్యటనపై ఏపీ సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. రాష్ట్ర అభివృద్ధిలో విశ్వసనీయ భాగస్వామి సింగపూర్ అని పేర్కొన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: సింగపూర్ పర్యటనపై ఏపీ సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. రాష్ట్ర అభివృద్ధిలో విశ్వసనీయ భాగస్వామి సింగపూర్ అని పేర్కొన్నారు. ఆదివారం సింగపూర్ మంత్రులు, పారిశ్రామికవేత్తలతో భేటీ కానున్నారు. సహకారం, సహవికాసం, శాశ్వత భాగస్వామ్యమే ఎజెండాగా ఈ పర్యటన సాగనుందని తెలిపారు. అంతర్జాతీయ వేదికపై APకి గుర్తింపు తెస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఇదిలా ఉంటే.. సింగపూర్ పర్యటనలో భాగంగా పెట్టుబడులను ఆకర్షించేందుకు పలువురు వ్యాపారవేత్తలు, పలు సంస్థల ప్రతినిధులతో చంద్రబాబు భేటీ అవుతారు. జూన్ 27వ తేదీ సింగపూర్ తెలుగు డయాస్పోరా ఫ్రం సౌత్ ఈస్ట్ ఏషియా అనే కార్యక్రమానికి చంద్రబాబు హాజరుకానున్నారు. ఈ కార్యక్రమంలో సింగపూర్‌తో పాటు పలుదేశాలకు చెందిన తెలుగు పారిశ్రామికవేత్తలు, కంపెనీల ప్రతినిధులు, పెట్టుబడుదారులు హాజరుకానున్నారు. అనంతరం సింగపూర్‌లోని వన్‌వరల్డ్ ఇంటర్నేషనల్ స్కూలులో AP NRT ఆధ్వర్యంలో సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో 1500 మంది ప్రతినిధులు పాల్గొంటారు.






