ఈ-సైకిళ్ల పంపిణీతో కుప్పంలో చరిత్ర.. గిన్నిస్ వరల్డ్ రికార్డు

by Ramesh Naini |

కుప్పం నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు నాయుడు రెండో రోజు పర్యటన కొనసాగుతోంది.

ఈ-సైకిళ్ల పంపిణీతో కుప్పంలో చరిత్ర.. గిన్నిస్ వరల్డ్ రికార్డు
X

దిశ, డైనమిక్ బ్యూరో : కుప్పం నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు నాయుడు రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. ఈ క్రమంలోనే నియోజకవర్గం, శాంతిపురం మండలం, శివపురంలోని నివాసం నుంచి తూంసీ వద్ద నిర్వహించే ప్రజా వేదిక వరకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ-సైకిళ్లతో ర్యాలీగా చేరుకున్నారు. పర్యావరణ పరిరక్షణ, మహిళల సాధికారతే లక్ష్యంగా 5,555 ఈ-సైకిళ్లను డ్వాక్రా మహిళలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. నూతన చరిత్రకు కుప్పం నుంచి శ్రీకారం చుట్టామని, కుప్పంలో 5,555 ఈ-సైకిళ్లు పంపిణీ చేసి చరిత్ర సృష్టించామని అన్నారు. గిన్నిస్‌ రికార్డు మాత్రమే కాదు.. రాబోయే రోజుల్లో మరిన్ని ప్రయోజనాలు ఉంటాయని అన్నారు. ఇంటిపై ఉత్పత్తయ్యే విద్యుత్‌తోనే సైకిల్‌కు ఛార్జింగ్‌ పెట్టుకోవచ్చన్నారు. ఈ సూపర్‌ సైకిల్‌.. పైసా ఖర్చు లేకుండానే దూసుకెళ్తుందని పేర్కొన్నారు. సైకిల్‌కు ఓటేశారు కాబట్టి అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపించామని సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు.

గిన్నిస్ వరల్డ్ రికార్డ్...

కాగా, 24 గంటల వ్యవధిలో ఇంత పెద్ద సంఖ్యలో ఈ-సైకిళ్లను లబ్ధిదారులకు అందించడం గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లోకి ఎక్కింది. గిన్నిస్ వరల్డ్ రికార్డు పత్రాన్ని ముఖ్యమంత్రికి ప్రతినిధులు అందజేశారు. ఇక, ఈ-సైకిళ్లను 'ఈ-మోటరాడ్' అనే సంస్థ తయారు చేసి కుప్పంలోని యూనిట్‌లో అసెంబ్లింగ్ చేసింది.

Next Story