బాలకృష్ణ సినిమాకు నేషనల్ అవార్డు.. CM చంద్రబాబు శుభాకాంక్షలు

by Gantepaka Srikanth |

నటసింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) ప్రధాన పాత్రలో నటించిన భగవంత్ కేసరి సినిమాకు నేషనల్ అవార్డు వరించిన విషయం తెలిసిందే.

బాలకృష్ణ సినిమాకు నేషనల్ అవార్డు.. CM చంద్రబాబు శుభాకాంక్షలు
X

దిశ, వెబ్‌డెస్క్: నటసింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) ప్రధాన పాత్రలో నటించిన భగవంత్ కేసరి సినిమాకు నేషనల్ అవార్డు వరించిన విషయం తెలిసిందే. 71వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను కేంద్రం శుక్రవారం ప్రకటించింది. జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా ‘భగవంత్‌ కేసరి’ని (Bhagavanth Kesari) అవార్డు వరించింది. అనిల్‌ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీలో శ్రీలీల, కాజల్‌, అర్జున్‌ రాంపాల్‌ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి అవార్డు రావడంపై ఏపీ సీఎం చంద్రబాబు(Chandrababu) స్పందించారు. సోషల్ మీడియా వేదికగా తన ఆనందాన్ని తెలియజేశారు. భగవంత్‌ కేసరి సినిమాకి జాతీయ అవార్డు రావడం సంతోషకరమైన విషయం. హీరో బాలకృష్ణ, చిత్రబృందానికి శుభాకాంక్షలు అని చంద్రబాబు పేర్కొన్నారు. బాలా మామయ్య సినిమాకు నేషనల్ అవార్డు రావడం చాలా సంతోషం. చిత్ర బృందానికి అభినందనలు అని నారా లోకేష్ ట్వీట్ చేశారు.

Next Story